Movie News

పొగరు హీరో మీద కోట్లు ధారపోశారు

కెజిఎఫ్ తర్వాతే మనకు కన్నడ స్టార్లు మెల్లగా అలవాటు పడుతున్నారు. దీని పుణ్యమాని బడ్జెట్ లు పెంచేసి ఓ మాదిరి మార్కెట్ ఉన్న హీరోలు కూడా ప్యాన్ ఇండియా అంటూ మల్టీ లాంగ్వేజ్ రిలీజులు డిమాండ్ చేస్తున్నారు. ధృవ సర్జ మనకు పెద్దగా పరిచయం లేని పేరు. ఆ మధ్య పొగరు అనే సినిమా వచ్చింది గుర్తుందా. రష్మిక మందన్న హీరోయిన్. కండలు తిరిగిన ఐరావతం లాంటి దేహంతో అందులో ధృవ ఓవర్ మాస్ గా కనిపించిన తీరు బిసి సెంటర్స్ లో పర్వాలేదనిపించుకుంది. గొప్పగా ఆడకపోయినా శరీరమే ఆకర్షణగా శాండల్ వుడ్ లో నెగ్గుకొస్తున్నాడు ధృవ.

ఇతని కొత్త సినిమా మార్టిన్. నిన్న బెంగళూరులో టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. తెలుగు మీడియాని ప్రత్యేకంగా విమానంలో తీసుకెళ్లి మరీ అతిథులుగా మర్యాదలు చేశారు. అంత బిల్డప్ ఎందుకయ్యా అంటే వీడియో చూస్తే కానీ అర్థం కాలేదు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇందులో మాములు మేకింగ్ లేదు. పాకిస్థాన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిన మార్టిన్ అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులను, చూస్తేనే గుండాగిపోయే భీకర ఆకారాల మనుషులను ఎదురుకునే పరిస్థితి వస్తుంది. మాన్స్ టర్ గా చెప్పుకునే మార్టిన్ ఎందుకా వలయంలోకి వెళ్లాడనేది స్టోరీ.

విజువల్స్ నిజంగానే వామ్మో అనిపించేలా ఉన్నాయి. హీరోయిజం ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్టు అనిపించినా పఠాన్ ఫలితం చూశాక సరైన రీతీలో చూపిస్తే జనం ఆదరిస్తారని అర్థమైపోయింది కాబట్టి మొత్తానికి సినిమా చూశాక ఎందుకింత ఖర్చు పెట్టారో అర్థమవుతుంది. వేసవి విడుదలని టార్గెట్ చేసుకున్న మార్టిన్ తో తెలుగు తమిళ మార్కెట్ ని ధృవ సర్జ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇతను ఎవరో కాదు. సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కు స్వయానా మేనల్లుడు. దీనికి కథను సమకూర్చింది కూడా ఆయనే. ఏపి అర్జున్ దర్శకుడు. కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

This post was last modified on February 24, 2023 10:32 am

Share

Recent Posts

నాని జడల లుక్… అందరూ వద్దే వద్దన్నా

టాలీవుడ్ దర్శకుల్లో కొత్త కథలతో ప్రయాణం చేస్తూ, ఒక కన్విక్షన్‌తో సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ పేరు ముందు వరుసలో…

2 hours ago

ఎగతాళి చేస్తారని ఆ విషయం దాచేసిన సందీప్ కిషన్

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయాడు విజయ్.…

2 hours ago

లైవ్ లోనే టీ-షర్ట్ విప్పేసిన సల్మాన్ ఖాన్

నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. ఎక్కడ చూసినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వీడియోనే…

3 hours ago

విద్యార్థినుల సింగిల్ జడలు కత్తిరించింది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ…

3 hours ago

నిన్న మల్లెపూల పల్లకి… రేపు రఘుకుల తిలకా రారా

ఫిలిం ఇండ‌స్ట్రీలో ఒక సినిమా పెద్ద హిట్ట‌యిందంటే.. ఆ చిత్రానికి క‌లిసొచ్చిన పాయింట్లేంటో చూసుకుని… ఆ అంశాలు త‌మ చిత్రాల్లో…

3 hours ago

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్.. చిరు మాస్టర్ ప్లాన్

వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్…

7 hours ago