ఇవాళ బాలీవుడ్ లో సెల్ఫీ రిలీజయ్యింది. పఠాన్ తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద విడుదల ఇదే. షారుఖ్ జోరు దాదాపుగా ఫైనల్ రన్ కు వచ్చేయడంతో ట్రేడ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. అయితే ఓపెనింగ్స్ ఆందోళనకరంగా ఉండటం టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే మూడు మల్టీప్లెక్సుల చైన్ కు దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కేవలం 9 వేల టికెట్లే అమ్ముడుపోయాయి. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో, ఇమ్రాన్ హష్మీ లాంటి సపోర్టింగ్ క్యాస్ట్ ఉన్నప్పటికీ ఇంత తక్కువ స్థాయిలో ఫిగర్లు నమోదు కావడం అనూహ్యం. ఏదో అద్భుతం జరిగితే తప్ప రికవరీ కష్టం.
దీనికి రామ్ చరణ్ కు కనెక్షన్ ఏంటనేదేగా మీ డౌట్. సెల్ఫీ మలయాళం బ్లాక్ బస్టర్ డ్రైవింగ్ లైసెన్స్ కు అఫీషియల్ రీమేక్. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ ఈగో డ్రామా హక్కులను చరణ్ ఎప్పుడో కొన్నాడు. కానీ ఇద్దరు హీరోలు అవసరం పడటంతో కాంబినేషన్ సెట్ కాక ఆలస్యమవుతూ వచ్చింది. ఒకదశలో రవితేజ, రానా, వెంకటేష్, వరుణ్ తేజ్ ఇలా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు. తెరకెక్కించాలనే ధృడ సంకల్పమైతే ఉంది కానీ కాంబో సమస్య వల్ల వ్యవహారం ఎంతకీ తేలక అలా పెండింగ్ పడిపోయింది.
ఇప్పుడీ సెల్ఫీకు వచ్చే రెస్పాన్స్ చూశాక డ్రైవింగ్ లైసెన్స్ ని తీద్దామా లేక అటకెక్కిద్దామా అనే నిర్ణయం చరణ్ తీసుకోబోతున్నట్టు తెలిసింది. కోట్లు ఖర్చు పెట్టి తీరా ఫ్లాప్ అయ్యాక బాధ పడటం కంటే రైట్స్ కోసం పెట్టిన డబ్బులు పోయాయనుకుంటేనే సుఖం కాబట్టి ఈ వారం పది రోజుల్లో ఏదోటి తేల్చేసే ఛాన్స్ లేకపోలేదు. ఒక సినిమా స్టార్ కు ఆర్టివో ఆఫీసర్ లో పని చేసే ఓ అధికారికి మధ్య జరిగే క్లాష్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ తీశారు. కొంచెం భీమ్లా నాయక్ తో పోలికలు ఉంటాయి. ఒరిజినల్ వెర్షన్ లో మంచి డ్రామా ఉంటుంది. మరి సెల్ఫీ రామ్ చరణ్ ని దేనికి ప్రేరేపిస్తుందో లెట్ సీ.
This post was last modified on February 24, 2023 10:29 am
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…
‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…
మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో హీరోగా రూపొందుతున్న కన్నప్పలో ప్రభాస్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.…
ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు…
బాలీవుడ్ లో పట్టువదలని విక్రమార్కుడు పేరు ఎవరికైనా ఉందంటే ముందు అక్షయ్ కుమార్ గురించే చెప్పుకోవాలి. ఫలితాలను పట్టించుకోకుండా విమర్శలను…
ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ లో జరుగుతున్నవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబునాయుడు గడచిన నాలుగు…