Movie News

చిరు కల్ట్ ఫ్యాన్స్‌కి పండగే..

మెగాస్టార్ చిరంజీవి అంటే ఏంటో చెప్పాలంటే 90వ దశకంలోకి వెళ్లాలి. అప్పుడు ఆయన చూసిన పీక్స్‌ను టాలీవుడ్ చరిత్రలోనే ఇంకెవరూ చూసి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్లతో చిరు ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేశారు. ఈ మూడు చిత్రాలూ ఒకదాన్ని మించి ఒకటి ఘనవిజయాలను సాధించాయి.

ఇక ఈ మూడింట్లో మాస్, ఫ్యాన్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నది ఏది అంటే.. ‘గ్యాంగ్ లీడర్’ పేరే చెప్పాలి. చిరు కెరీర్లో బెస్ట్ లుక్.. బెస్ట్ మేనరిజమ్స్ ఈ చిత్రంలో చూడొచ్చు. హీరోయిజం పరంగా పీక్ ఎలివేషన్ ఉంటుంది. ఇందులో చిరు డ్యాన్సులు.. ఫైట్లు.. డైలాగులు కూడా ఒక రేంజిలో ఉంటాయి. ఒక అభిమాని తన స్టార్ హీరోను ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’. ఇక సినిమా రిలీజ్ టైంలో చిరు అభిమానుల సెలబ్రేషన్స్ గురించి అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. వాటి గురించి నిన్నటితరం చిరు అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇప్పుడు ఆ కల్ట్ ఫ్యాన్స్ అందరూ నాటి రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడానికి.. ఆ సెలబ్రేషన్లను రిపీట్ చేయడానికి అవకాశం వచ్చింది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా మళ్లీ థియేటర్లలోకి దిగుతోంది. మార్చి 4న ‘గ్యాంగ్ లీడర్’ 4కే ప్రింట్‌తో రీరిలీజ్ అవుతోంది. ఇంతకుముందు ‘ఘరానా మొగుడు’ సహా కొన్ని చిరు సినిమాలను రీరిలీజ్ చేశారు కానీ.. అవి పేలవమైన ప్రింట్లతో, ఏ ప్రచారం లేకుండా రావడం వల్ల సరైన స్పందన తెచ్చుకోలేదు. కానీ ‘గ్యాంగ్ లీడర్’ను అధునాతన టెక్నాలజీతో కరెక్ట్ చేసి, ఫుల్ క్లారిటీతో రిలీజ్ చేస్తున్నారు. పైగా రిలీజ్ ప్లానింగ్, ప్రమోషన్ కొంచెం గట్టిగా చేస్తున్నారు. కాబట్టి చిరు కల్ట్ ఫ్యాన్స్ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి మంచి అవకాశం లభించినట్లే.

This post was last modified on February 24, 2023 1:21 am

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

5 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

6 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

6 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

7 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

9 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

10 hours ago