తెలుగులో ధనుష్ గ్రాండ్ ఎంట్రీకి ఉపయోగపడ్డ సార్ వసూళ్లు స్టడీగా ఉన్నాయి. పోటీలో ఉన్న వినరో భాగ్యము విష్ణుకథలో దీనికి సాటి వచ్చేంత కంటెంట్ లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు సంపూర్ణంగా సార్ కే దక్కుతోంది. ఇందులో విద్య వ్యవస్థ లోపాలు, ప్రభుత్వ కళాశాలల దుస్థితి గురించి చూపించిన తీరు కన్నా గురు శిష్యుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించిన వైనం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఫైనల్ రన్ అయ్యేలోగా సులభంగా వంద కోట్ల గ్రాస్ ని దాటేలా చేస్తుంది. తిరుని మించిన పెద్ద హిట్ గా నిలవడం ఖాయమే.
దీని సంగతలా ఉంచితే గత నెల ఇరవై ఆరున కన్నడలో క్రాంతి అనే భారీ బడ్జెట్ చిత్రమొకటి రిలీజయ్యింది. నిన్నే ఓటిటిలో తెలుగు ఆడియోతో పాటు వచ్చేసింది. మనకు ఇక్కడ రవితేజ లాగా శాండల్ వుడ్ లో దర్శన్ కు అంత మార్కెట్ ఉంది. కానీ మనదగ్గర ఇప్పటిదాకా కనీసం ఏవరేజ్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే క్రాంతిలో మెయిన్ పాయింట్ సార్ లో ఉన్న థీమ్ రెండింటిలో దగ్గరి పోలిక చాలా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ ని ఆక్రమించుకుని వ్యాపారం చేసే ఉద్దేశంతో మంత్రితో చేతులు కలిపి వాటి దత్తతకు ప్లాన్ చేస్తాడు కార్పొరేట్ స్కూల్ ఓనర్ (తరుణ్ అరోరా).
దాని కోసం బాగా నడుస్తున్న పాఠశాలల్లో బాంబులు పెట్టేందుకు కూడా వెనుకాడడు. తనకిష్టమైన మాస్టారు పిలిచినందుకు అమెరికా నుంచి వచ్చిన బిజినెస్ మెన్ క్రాంతి(దర్శన్)వాళ్ళను అడ్డుకునేందుకు నడుం బిగిస్తాడు. పక్కా కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ మూవీ మొత్తం ఓవర్ ఎలివేషన్లు, హీరో భజన కీర్తనలతో నింపేసి రొటీన్ కి కేరాఫ్ అడ్రెస్ గా మార్చేశారు. క్రాంతి పాత్రకిచ్చిన ఓవర్ బిల్డప్ వల్ల సీరియస్ పాయింట్ కాస్తా మాస్ మసాలా అయిపోయింది. అయినా ఇలాంటి సబ్జెక్టులను డీల్ చేయాలంటే సెన్సిటివ్ గా రాసుకోవడం ఒక ఆర్ట్. అందరూ వెంకీ అట్లూరిలు కాలేరు.
This post was last modified on February 23, 2023 3:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…