కొత్త సినిమాల్లో సార్, వినరో భాగ్యము విష్ణుకథలు పూర్తి చేసినవాళ్లకు ఈ శుక్రవారం అట్టే ఆప్షన్లు లేవు. మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్ తప్ప చెప్పుకోదగ్గ రిలీజులేవీ ప్లాన్ చేసుకోలేదు. ఇవి కూడా టాక్ బాగుందని బయటికి వస్తే తప్ప కనీస ఓపెనింగ్స్ తెచ్చుకునే పరిస్థితిలో లేవు. మరి థియేటర్ కు వెళ్లనిదే ఎంటర్ టైన్ మెంట్ ఎలాగబ్బా అనుకునేవాళ్లకు నాని, రవితేజలు రీ రిలీజుల రూపంలో వెల్కమ్ చెబుతున్నారు. మాస్ మహారాజా మిరపకాయ్ ని రేపు ఏపీ తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. స్క్రీన్ కౌంట్ కూడా గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.
ధమాకా, వాల్తేరు వీరయ్య వరస హిట్లతో ఊపుమీదున్న ఫ్యాన్స్ నుంచి నిర్మాతలు భారీ స్పందన ఆశిస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్ కి మొదటి బ్రేక్ ఇది. దీన్ని చూశాకే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీమేక్ కోసం ఇతనికి కబురు పెడితే నూటికి నూరు శాతం నమ్మకాన్ని నిలిబెట్టుకున్నాడు. ఇక న్యాచురల్ స్టార్ అలా మొదలైంది సైతం మరోసారి పలకరించేందుకు రెడీ అయ్యింది. నాని పుట్టినరోజు సందర్భంగా హఠాత్తుగా దీన్ని తెరపైకి తెచ్చారు. కూల్ ఎంటర్ టైనరైనా నానిని స్టార్ లీగ్ లోకి తెచ్చింది ఈ మూవీనే. సోషల్ మీడియాలో కల్ట్ స్టేటస్ దీనిది.
క్లీన్ కామెడీ, హిట్ మ్యూజిక్ తో పాటు తనలో బెస్ట్ టైమింగ్ పరిచయమయ్యింది దీంతోనే. తాగుబోతు రమేష్, దర్శకురాలు నందినిరెడ్డిలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత జోరుగా లేవు కానీ కరెంట్ సేల్స్ మీద డిస్ట్రిబ్యూటర్లు నమ్మకం పెట్టుకున్నారు. గత ఆరు నెలలుగా నిత్య ప్రవాహంగా సాగుతున్న ఈ రీ రిలీజులు దగ్గరి భవిష్యత్తులో ఆగే సూచనలు కనిపించడం లేదు పైపెచ్చు వెతికి మరీ ఏవి విడుదల చేద్దామాని చూస్తున్న ప్రొడ్యూసర్లు ఎక్కువైపోయారు. మరి ఈ మిరపకాయ్ ఘాటు, అలా మొదలైంది స్వీటు జనాన్ని మరోసారి మెప్పిస్తాయో లేదో చూడాలి.
This post was last modified on February 23, 2023 12:27 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…