మెగాస్టార్ చిరంజీవి నుంచి కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు వచ్చేశాయి. గత ఏడాది వేసవిలో ఆచార్య సినిమాతో పలకరించిన ఆయన.. దసరాకి గాడ్ ఫాదర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంక్రాంతికేమో వాల్తేరు వీరయ్యగా సందడి చేశాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నది ఒక్క బోళా శంకర్ సినిమా మాత్రమే. ముందు అనుకున్న వెంకీ కుడుముల సినిమా క్యాన్సిల్ కావడంతో భోళా శంకర్ పూర్తయ్యాక చిరు ఏ చిత్రంలో నటిస్తాడనే విషయంలో అయోమయం నెలకొంది.
ఐతే చిరు కొంచెం చురుగ్గానే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సీనియర్ దర్శకుడు.. తనకు ఠాగూర్, ఖైదీ నంబర్ 150 లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన వి.వి.వినాయక్‌తో సినిమా చేయడానికి చిరు పచ్చ జెండా ఊపినిట్లు తెలుస్తోంది.
వినాయక్ ఇప్పుడు సరైన ఫాంలో లేడు. రీమేక్ మూవీ అయిన ఖైదీ నంబర్ 150 మినహా చాలా ఏళ్ల నుంచి వినాయక్‌కు హిట్ లేదు. చాన్నాళ్ల నుంచి ఛత్రపతి హిందీ రీమేక్ కోసం పని చేస్తున్నాడు కానీ.. దాని గురించి అతీ గతీ లేదు. ఈ ప్రాజెక్టు వల్ల వినాయక్‌కు కొత్తగా ఒనగూరేదేమీ లేకపోవచ్చు. తెలుగులో స్టార్ హీరోలు వినాయక్‌తో సినిమా చేసేందుకు ఆసక్తితో లేరు. కానీ చిరు మాత్రం తనకు పెద్ద హిట్లిచ్చాడన్న కృతజ్ఞతతో వినాయక్‌తో పని చేయడానికి ముందుకొచ్చినట్లున్నాడు.
కానీ పూరి జగన్నాథ్, వెంకీ కుడుముల లాంటి దర్శకులకు ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. తీరా స్క్రిప్టు దగ్గరికి వచ్చేసరికి సంతృప్తి చెందక సినిమాలు క్యాన్సిల్ చేశాడు చిరు. వినాయక్‌కు కొన్నేళ్ల కిందట బాలయ్యను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా ఆయన్ని కథతో మెప్పించలేకపోయాడు. ఇప్పుడు చిరు కూడా కథ లేకుండానే వినాయక్‌కు మాట ఇచ్చాడు. కానీ తీరా కథ సంగతి వచ్చేసరికి ఏమవుతుందో చెప్పలేం. కాబట్టి చిరు సినిమా చేద్దామన్నా.. వినాయక్ ఇప్పుడే సంబరపడిపోవాల్సిన పని లేదు.
This post was last modified on February 23, 2023 9:25 am
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…