నాగ్ సినిమా… ఇంకా అడ్వాన్స్ తీసుకోలేదు

ప్రతీ హీరోకి ఓ ఫేవరెట్ హీరో ఉంటారు. అల్లరి నరేష్ కి కూడా ఓ ఫేవరెట్ హీరో ఉన్నారు. చిన్నతనం నుండి నరేష్ కి నాగార్జున అంటే ఇష్టం. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పుకున్నాడు అల్లరోడు. అయితే ఇంత వరకూ ఈ కాంబోలో సినిమా రాలేదు. త్వరలో ప్రసన్న కుమార్ ఈ కాంబోను స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే నరేష్ కి స్క్రిప్ట్ చెప్పడం ఓకే అనేయడం జరిగిపోయింది. ఈ నెలలోనే సినిమా ఓపెనింగ్ అనుకుంటున్నారు.

అయితే తాజాగా అల్లరి నరేష్ కి ఈ సినిమా అప్ డేట్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. నాగార్జున గారికి మీరు పెద్ద ఫ్యాన్ కదా ఆయనతో సినిమా ఉంటుందా ? అని అడగ్గా మీరు దేని గురించి అడుగుతున్నారో నాకర్థమైంది. కానీ ఇంకా సైన్ చేయలేదు. ప్రొడక్షన్ హౌజ్ నుండి త్వరలోనే అప్ డేట్ వస్తుందంటూ చెప్పుకున్నాడు. ఇంకా సినిమాకు డబ్బులు తీసుకోలేదని అడ్వాన్స్ తీసుకున్నాకే ప్రొడక్షన్ హౌజ్ ఎనౌన్స్ చేసేది అంటూ నవ్వుతూ చెప్పాడు నరేష్.

నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ తో పాటు మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నాడు. నాగార్జున కోసం హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు ప్రసన్న. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజీలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు కానుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన పొరింజు మరియమ్ జోస్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నాడు.