Movie News

టాలీవుడ్ నిర్మాతలకు బాలీవుడ్ పంచ్

టాలీవుడ్ హీరోలే కాదు.. నిర్మాతలు సైతం పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని చూస్తున్నారు ఈ మధ్య. అందుకోసం ఓవైపు పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటూనే ఇతర భాషల్లోకి వెళ్లి సినిమాలు నిర్మించే ప్రయత్నమూ చేస్తున్నారు. ఈ ఏడాది ‘వారిసు’ చిత్రంతో దిల్ రాజు, ‘వాత్తి’ మూవీతో సితార నాగవంశీ కోలీవుడ్లో అడుగు పెట్టారు. వారికి మంచి ఫలితమే దక్కింది.

కానీ ఇండియాలో అతి పెద్ద ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్లో జయకేతనం వేయాలని చూస్తున్న టాలీవుడ్ నిర్మాతలకు మాత్రం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి మన ప్రొడ్యూసర్లు నిర్మిస్తున్న చిత్రాలకు దారుణమైన ఫలితాలు ఎదురవుతున్నాయి. వాళ్లు ప్రధానంగా రీమేక్ సినిమాలతోనే బాలీవుడ్లో హిట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. అవి వర్కవుట్ కావట్లేదు.

దిల్ రాజుకు గత ఏడాది హిందీలో రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. తెలుగు హిట్ ‘హిట్’ను రాజ్ కుమార్ రావు హీరోగా హిందీలో నిర్మించిన ప్రొడ్యూసర్లలో రాజు ఒకడు. అది కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. ఇక ‘జెర్సీ’ సినిమాను తెలుగు వెర్షన్ నిర్మాత నాగవంశీతో కలిసి హిందీలో పునర్నిర్మించాడు రాజు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాగే సంచలనం రేపుతుందనుకుంటే.. ఇది చతికిలపడింది.

ఇక గతంలో ‘గజిని’ సినిమాతో బాలీవుడ్లో భారీ విజయాన్నందుకున్న అల్లు అరవింద్.. తెలుగులో తన కొడుకు హీరోగా తెరకెక్కిన నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ను ‘షెజాదా’ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో ఒరిజినల్ ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎస్.రాధాకృష్ణ నిర్మాణ భాగస్వామే. కానీ వీళ్లిద్దరికీ చేదు అనుభవాన్ని మిగులుస్తూ ఈ రీమేక్ డిజాస్టర్‌గా నిలిచింది. మన నిర్మాతలు హిందీలో సినిమాలు చేయడం బాగానే ఉంది కానీ.. రీమేక్‌ల కంటే ఒరిజినల్ స్టోరీల మీద దృష్టిపెడితే మంచిదని ఈ చిత్రాల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

This post was last modified on February 22, 2023 3:55 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

16 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

16 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

17 hours ago