రజతోత్సవాలు దశాబ్దాల కిందటే చరిత్రలో కలిసిపోయాయి. శతదినోత్సవాల కథ మరిచిపోయి కూడా చాలా ఏళ్లయిపోయింది. సినిమాలు ఎంత పెద్ద హిట్ అనేది 50, 100 రోజుల సెంటర్లను బట్టి లెక్కలు వేసే రోజులు కావివి. ఇప్పుడంతా వసూళ్లను బట్టే సినిమా ఫలితాన్ని అంచనా వేస్తున్నారు. కొన్ని సెంటర్లలో కూడా ఓ సినిమా 50 రోజులు ఆడడం గగనం అయిపోతోంది. సినిమాల మేకర్స్ కూడా ఆ లెక్కల్ని అస్సలు పట్టించుకోవడం లేదు.
ఇలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ లాంగ్ రన్‌తో ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం పెద్ద సంఖ్యలోనే థియేటర్లలో 50 రోజుల వేడుకలను జరుపుకోబోతోంది. మార్చి 3తో ‘వాల్తేరు వీరయ్య’ అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకోనుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో థియేటర్లు ఈ వేడుకకు సిద్ధమవుతున్నాయి.
ఒక్క నైజాం ఏరియాలో మాత్రమే దాదాపు 40 సెంటర్లలో ‘వాల్తేరు వీరయ్య’ అర్ధశతకం జరుపుకోనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 15 సెంటర్లు డైరెక్ట్ కాగా.. 25 సెంటర్ల దాకా షిఫ్ట్‌తో 50 రోజులు పూర్తి చేసుకోనున్నాయి. ఆంధ్రా ఏరియాలో కూడా దాదాపు ఇదే సంఖ్యలో 50 రోజుల సెంటర్లు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ప్రతి పేరున్న సెంటర్లో ఈ సినిమా 50 రోజులు ఆడుతోంది. రాయలసీమలో కూడా చెప్పుకోదగ్గ సెంటర్లలో 50 రోజుల పోస్టర్ పడనుంది. దగ్గర దగ్గర 100 సెంటర్లలో ‘వాల్తేరు వీరయ్య’ 50 రోజులు ఆడొచ్చని అంటున్నారు. ఆ టైంకి పూర్తి వివరాలు బయటికి రావచ్చు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు కూడా ఇన్ని సెంటర్లలో 50 రోజులు ఆడింది లేదు. ఈ రోజుల్లో ఓ సినిమా ఇన్ని సెంటర్లలో అర్ధశత దినోత్సవం జరుపుకోవడం అంటే అరుదైన విషయమే. సంక్రాంతి సినిమాల్లో లాంగ్ రన్‌తో నిలబడింది ‘వాల్తేరు వీరయ్య’ మాత్రమే. తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా రెండు వీకెండ్లకు మించి నిలవలేకపోయింది.
This post was last modified on February 22, 2023 3:44 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…