గత కొన్నేళ్లలో దక్షిణాదిన తక్కువ అంచనాలతో రిలీజై పెద్ద హిట్టయిన సినిమాల్లో ‘ఖైదీ’ ఒకటి. కార్తి హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కేరళ, కర్ణాటకల్లో కూడా బాగా ఆడింది. తెలుగులో లో బజ్‌తో రిలీజైనప్పటికీ.. మంచి టాక్ రావడంతో అంతకంతకూ కలెక్షన్లు పెంచుకుంటూ సూపర్ హిట్ రేంజిని అందుకుంది.
‘ఖైదీ’ రిలీజైన కొన్ని నెలలకే హిందీలో రీమేక్ కోసం నటుడు, దర్శకుడు అజయ్ దేవగణ్ రీమేక్ హక్కులు తీసుకున్నాడు. తనే ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు అజయ్. మార్చి నెలాఖర్లో ‘భూలా’ పేరుతో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
‘ఖైదీ’లో ఎక్కడా కూడా హీరోయిన్ కనిపించదు. తన భార్య గురించి కార్తి ఊరికే మాటల్లో మాత్రమే చెబుతాడు. దృశ్య పరంగా అతడి గతాన్ని ఏమీ చూపించరు. అతడి బ్యాక్ స్టోరీ అంటూ ఏమీ తెరపై కనిపించదు. ఐతే అతడి పూర్వ కథతో ‘ఖైదీ ప్రీక్వెల్’ తీయాలని దర్శకుడు లోకేష్ భావిస్తున్నాడు. భవిష్యత్తులో ఆ కథతో సినిమా ఉండొచ్చు. ఐతే ఈలోపే అజయ్ హీరో పూర్వ కథను ‘భూలా’లో చూపించేసినట్లున్నాడు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అజయ్ పక్కన కథానాయిక కనిపించింది. ఆ పాత్రను అమలా పాల్ పోషించడం విశేషం. వీళ్లిద్దరి మీద ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. పాట చివర్లో హీరోయిన్ కోసం వస్తున్న రౌడీలను హీరో ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ దృశ్యం చూపించారు. లోకేష్ భవిష్యత్తులో ఒక సినిమాగా తీయాలనుకున్న పాయింట్‌ను అజయ్ ఈ సినిమాలో చిన్న ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపించేసినట్లున్నాడు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు అతను ఇంకా మార్పులేవో చేసినట్లున్నాడు. ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించడం విశేషం.
This post was last modified on February 21, 2023 8:16 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…