‘ఖుషి’ షూటింగ్ ఎట్టకేలకు !

విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ తీస్తున్న ‘ఖుషి’ ఏ ముహూర్తన మొదలైందో కానీ ఈ సినిమాకి సమంత రూపంలో పెద్ద బ్రేక్ పడింది. కాశ్మీర్ లో ఒక షెడ్యూల్ పూర్తవ్వగానే వెంటనే వైజాగ్ లో మరో షెడ్యూల్ చేశారు. ఆ ఘాట్ తర్వాత సమంత ఊహించని విధంగా అనారోగ్యానికి గురైంది. మైయోసైటీస్ అనే వ్యాదితో బాధ పడుతున్న సమంత ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోవడంతో ఖుషి షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఈ నెలాఖరున హైదరాబాద్ లో మొదలుకాబోతుంది.

ఫిబ్రవరి 26 లేదా 28 నుండి షూటింగ్ మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సమంత ముంబైలో ఉంటూ ఓ వెబ్ సిరీస్ ఘాట్ చేస్తుంది. ఈ నెలాఖరుతో సిరీస్ ఘాట్ కంప్లీట్ కానుండటంతో సమంత ఖుషి కి డేట్స్ ఇచ్చేసింది. ప్రస్తుతం శివ నిర్వాణ షెడ్యూల్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు. మిగతా ఆర్టిస్టుల డేట్స్ ను బట్టి సీన్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ కోసం సెట్ వర్క్ జరుగుతుంది. అలాగే కొన్ని నేచురల్ లొకేషన్స్ లో సీన్స్ తీయబోతున్నారు. ఈ సినిమా కోసమే విజయ్ కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టే రోజు కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఖుషి’ ను వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసి గౌతం తిన్ననూరితో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. దాని తర్వాత పరశురామ్ తో సినిమా ఉండబోతుంది.