పవర్ స్టార్ అభిమానులు హరిహర వీరమల్లు కోసం ఎదురు చూస్తుంటే రిలీజుల విషయంలో మాత్రం పెద్ద ట్విస్టు ఎదురయ్యేలా ఉంది. దాని బ్యాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం అవసరం పడటంతో ఈ వేసవి మీద ఆశలు పెట్టుకోకపోవడం బెటర్. దాని స్థానంలో సమ్మర్ కానుకగా వినోదయ సితం రీమేక్ ని రిలీజ్ చేసే లక్ష్యంతో ప్లాన్స్ మారిపోయాయని లేటెస్ట్ అప్ డేట్. ఈ వారంలో సముతిరఖని దర్శకత్వంలో దీని షూటింగ్ మొదలుకానుంది. త్రివిక్రమ్ రచనా చేస్తున్నారో లేక సహకారం అందిస్తున్నారో స్పష్టంగా తెలియదు కానీ ఆయన ప్రమేయమైతే ఉంది.
కేవలం 20 రోజుల పవన్ కాల్ షీట్స్ తో కీలకమైన షెడ్యూల్ ని పూర్తి చేశాక మిగిలిన పనులు చూస్తారట. సాయి ధరమ్ తేజ్ దీనికోసమే తన డేట్లు ఎవరికి ఇవ్వకుండా వెయిట్ చేస్తున్నాడు. ఎలాగూ ఏప్రిల్ లో విరూపాక్ష రిలీజ్ ఉంది కాబట్టి ఆలోగా మావయ్య సినిమాని పూర్తి చేసుకుంటే నేరుగా మూవీ ప్రమోషన్లకు వెళ్లిపోవచ్చు. సముతిరఖని కొద్దిరోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కోలీవుడ్ కమిట్ మెంట్స్ కి చిన్న బ్రేక్ ఇచ్చి ముందీ వినోదయ సితం వర్క్ ని ఫినిష్ చేశాకే చెన్నై తిరిగి వెళ్ళిపోతారట. ఓపెనింగ్ అట్టహాసంగా చేస్తారా లేక సింపుల్ గా ఉంటుందానేది చూడాలి.
దీంతో పాటు సమాంతరంగా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తారా లేక ఓజిలో పాల్గొంటారా అనేది సస్పెన్స్. వీరమల్లు మాత్రం కొంత బ్రేక్ తీసుకోక తప్పేలా లేదు. 2024 సంక్రాంతికి ఆల్రెడీ ప్రభాస్ ప్రాజెక్ట్ కె లాక్ అయిపోయింది. పుష్ప 2 వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. రామ్ చరణ్ 15 ఆ టైంలోనే వస్తే సమస్య జఠిలంగా మారుతుంది. అలాంటప్పుడు హరిహరవీరమల్లు వీటికన్నా ముందే సోలోగా వస్తే బాగుంటుంది. తమిళంలో ఓటిటిలో రిలీజ్ జరుపుకున్న వినోదయ సితం రీమేక్ కు సంబంధించిన తెలుగు టైటిల్, ఇతర క్యాస్టింగ్ తదితర వివరాలు త్వరలో ప్రకటించబోతున్నారు.
This post was last modified on February 21, 2023 12:57 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…