సోషల్ మీడియా రాను రాను మరీ చేపల మార్కెట్ కంటే విచిత్రంగా తయారవుతోంది. దేని గురించి ఎప్పుడు ఏ రూపంలో ట్రోలింగులు చేసుకుంటారో గొడవలు పడతారో అంతు చిక్కడం లేదు. ఆ మధ్య ఓజి ట్యాగ్ కోసం విచిత్రంగా స్వంత బాబాయ్ అబ్బాయి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో కొట్టుకోవడం చాలా దూరం వెళ్ళింది. అంతకు ముందు ఆర్ఆర్ఆర్ క్రెడిట్ విషయంలో తారక్ చరణ్ అభిమానులు ఇదే తరహాలో పదుల సంఖ్యలో మాటా మాటా అనుకున్నారు. ఇవేవి రోడ్ల మీదకొచ్చి కొట్టుకునేవి కాకపోయినా మొహాలు కనిపించని వర్చువల్ వరల్డ్ లో ప్రభావం ఎక్కువే.
ఇప్పుడు ఫ్రెష్ గా ఓ కొత్త టాపిక్ రచ్చ చేస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి పాత్ర ప్రకారం పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్న విషయం లీకైపోయింది. ఇదొక్కటే కాదు ఒక పవన్ బ్లాక్ బస్టర్ పాటకు మెగాస్టార్ డాన్స్ కూడా చేశారట. మాములుగా అయితే ఇది మంచి కిక్ ఇచ్చే సంగతి. మూవీ లవర్స్ అదే ఫీలయ్యారు. కానీ ఫ్యాన్స్ ఆలోచన మరోలా ఉంది. పవన్ ని చిరు ఇష్టపడినట్టుగా స్క్రీన్ మీద చూపించడం ఏమిటని ఓన్లీ చిరు ఫ్యాన్స్ తమ అయిష్టాన్ని బయట పెట్టారు.
దీనికి పవన్ ఫాలోయర్స్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. స్వంత అన్నయ్య కూడా ఇప్పుడు తమ్ముడు బ్రాండ్ వాడుకోవాల్సి వచ్చిందని రిటార్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఎంత ఘాడమైన బాండింగ్ ఉందో తెలిసి కూడా ఇలా అర్థం పర్థం లేని ట్రోల్స్ చేసుకోవడం వల్ల అనవసరంగా ఇష్యూ ఎక్కడికో వెళ్లిపోయేలా ఉంది. చిరు అదేదో ఇంకెవరికో అభిమానిగా యాక్ట్ చేస్తే ఫీలవ్వాలి కానీ ఇలా రక్తం పంచుకుపుట్టిన తమ్ముడికి ఫ్యానిజం చేస్తే ఆనందపడాల్సిందిపోయి ఇలా ఆన్ లైన్లో అనుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు.
This post was last modified on February 20, 2023 11:44 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…