Movie News

త‌మిళ క్రిటిక్స్.. ఇప్పుడేమంటారు?

దేశంలో తెలుగు ప్రేక్షకులంత విశాల హృదయం ఎవరికీ ఉండదని చెప్పడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం.. ఇతర భాషా చిత్రాలను మన వాళ్లు ఎలా ఆదరిస్తున్నారో? తమిళం, హిందీ, మలయాళం, కన్నడ.. ఇలా ఏ భాష నుంచైనా సరే.. అనువాద చిత్రాలు వచ్చి అవి బాగున్నాయన్న టాక్ వస్తే అందులో హీరో హీరోయిన్లు ఎవరు.. ఆ సినిమా తీసింది ఎవరు అని పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లి చూస్తారు. ఇంకే ఇండస్ట్రీలోనూ వేరే భాషా చిత్రాలనూ ఈ స్థాయిలో ఆదరించడం కనిపించదు.

అలాంటి తెలుగు ప్రేక్షకుల గురించి గత ఏడాది ‘పొన్నియన్ సెల్వన్’ రిలీజ్ టైంలో అవాకులు చెవాకులు పేలారు తమిళ జనాలు. అందులో కొందరు ప్రముఖ క్రిటిక్స్ కూడా ఉండడం విశేషం. తాము గర్వకారణంగా భావిస్తున్న సినిమాను తెలుగు ప్రేక్షకులు కించపరుస్తున్నారని.. వారికి టేస్ట్ లేదని పేర్కొంటూ.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు.

కట్ చేస్తే కొన్ని రోజుల్లోనే ‘కాంతార’ సినిమా తెలుగు బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాను నెత్తిన పెట్టుున్నారు మనవాళ్లు. ఆపై ‘లవ్ టుడే’ అనే చిన్న తమిళ చిత్రాన్ని తెలుగులో బాగా ఆదరించారు. ఇలాంటి చిన్న సినిమా తెలుగు నుంచి తమిళంలోకి వెళ్తే అసలు పట్టించుకునేవారా అన్నది సందేహం. ఇక సంక్రాంతికి విజయ్ సినిమా ‘వారసుడు’ కూడా తెలుగులో బాగానే ఆడింది. ఇప్పుడు ధనుష్ సినిమా ‘సార్’కు తెలుగులో వస్తున్న ఆదరణ చూస్తే తమిళ జనాలకు అసలు నోట మాట రాదేమో. తాను తొలిసారి చేసిన తెలుగు చిత్రానికి ఇంతటి ఆదరణ దక్కుతుందని.. తనకు తెలుగు ప్రేక్షకులు ఇలాంటి వెల్కమ్ చెబుతారని ధనుష్ కూడా ఊహించి ఉండడేమో.

ధనుష్ తమిళంలో టాప్ స్టార్లలో ఒకడు. ‘సార్’ సినిమాకు తమిళంలో ఎంత వసూళ్లు వస్తున్నాయో.. తెలుగులో దాదాపు సమానంగా కలెక్షన్లు ఉణ్నాయి. మూడు రోజుల్లో రూ.16 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచిందీ సినిమా. ఈ వసూళ్ల లెక్కలు చూసి తమిళ క్రిటిక్స్‌ను ట్యాగ్ చేసి.. తెలుగు ప్రేక్షకులంటే ఇదీ, ఇప్పుడేమంటారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు మన నెటిజన్లు.

This post was last modified on February 20, 2023 4:59 pm

Share

Recent Posts

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

1 hour ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

2 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

2 hours ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

2 hours ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

3 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

3 hours ago