ఒక పెద్ద సినిమా విడుదల తేదీని ప్రకటించినంత మాత్రాన ఖచ్చితంగా ఆ డేట్ కే కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేని పరిస్థితులు పరిశ్రమలో నెలకొన్నాయి. గత మూడు నాలుగేళ్లలో ఏ ఒక్క స్టార్ హీరో చిత్రం చెప్పిన టైంకి వచ్చిన దాఖలాలు లేవు.
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28 ఆగస్ట్ పదకొండున రిలీజ్ అవుతుందని బుట్టబొమ్మ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో నిర్మాత నాగ వంశీ చెప్పిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ దానికి బలంగా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది వాయిదా పడొచ్చని తెలిసింది.
చిరంజీవి భోళాశంకర్ ని ఏప్రిల్ రేస్ నుంచి తప్పించి దాని స్థానంలో అఖిల్ ఏజెంట్ ని తేవడం ఇటీవలే జరిగిన సరికొత్త డెవలప్ మెంట్. రెండింటి నిర్మాత ఒకరే కాబట్టి ఈ సౌలభ్యం కుదిరింది.
అయితే మెగా మూవీ ఎప్పుడనే ప్రశ్నకు సమాధానంగా ఆగస్ట్ 11 అనుకుంటున్నారట. అదేంటి అప్పుడు మహేష్ ఆల్రెడీ లాక్ చేసుకున్నాడుగా అంటే అప్పటికి షూటింగ్ అవ్వదనే మాట వినిపిస్తోంది. కేవలం అయిదు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ తో సహా మొత్తం పూర్తి చేయాలంటే హడావిడిగా పరుగులు పెట్టాల్సి ఉంటుంది. ఇది త్రివిక్రమ్ స్టైల్ కి విరుద్ధం.
అందుకే దాని బదులు అక్టోబర్ లో దసరా పండగను టార్గెట్ గా పెట్టుకుందామని సితార టీమ్ ప్రాధమికంగా ఫిక్స్ అయినట్టు తెలిసింది. అఫీషియల్ గా ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఇదంతా తెలిసే భోళా శంకర్ కి ఆ డేట్ కి వదిలే ప్రతిపాదనతో ఫ్రెష్ గా ముందుకొచ్చింది.
ఇండిపెండెన్స్ డేతో కలిపి పెద్ద వీకెండ్ ఆ వారంలో వచ్చే సినిమాలకు కలిసి వస్తుంది. అందుకే మహేష్ 28కి దాన్ని అందుకున్నారు. ప్రస్తుతం టర్కీలో ఉన్న మహేష్ తిరిగి రాగానే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూ వచ్చిన ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ ఎప్పుడు వచ్చినా రికార్డుల ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు
This post was last modified on February 20, 2023 6:05 am
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…
‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…
ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…
ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…
రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…