వరస సినిమాలు చేస్తున్న ఆనందం తప్ప వాటి ఫలితాలను కనీస స్థాయిలో ఆస్వాదించలేకపోతున్న కుర్ర హీరో సంతోష్ శోభన్ కు మరో షాక్ తగిలింది. అనవసరమైన పోటీ మధ్య తగుదునమ్మా అంటూ అతని నిర్మాతలు తీసుకుంటున్న రిస్క్ కనీస ఓపెనింగ్స్ తేలేకపోతున్నాయి.
చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన శ్రీదేవి శోభన్ బాబు నిన్న రిలీజయ్యింది. ఒకపక్క సార్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇంకోవైపు వినరో భాగ్యము విష్ణుకథకు ప్రమోషన్లు జోరుగా ఉన్నాయి. వీటి మధ్యలో సంతోష్ వచ్చాడు.
కథగా చెప్పడానికి ఇందులో వీసమెత్తు కొత్తదనం లేదు. డైరెక్టర్ మీద నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలి లాంటి నిన్నటి తరం బ్లాక్ బస్టర్స్ ప్రభావం బలంగా ఉంది. క్లాసిక్స్ ని స్ఫూర్తిగా తీసుకోవడానికి బదులు వాటిలో నుంచే ఒక్కో పాయింట్ తీసుకుని ఈ లవ్ స్టోరీని కుట్టేశాడు.
ఓ అన్నయ్య(నాగబాబు) ఓ చెల్లెలు(రోహిణి)విడిపోతారు. వీళ్ళ పిల్లలకు పెళ్ళైతేనే ఆస్తి దక్కుతుందనే కండీషన్ తో తాత వీలునామా రాసి పోయుంటాడు. కానీ మన శ్రీదేవి(గౌరీ కిషన్) శోభన్ బాబు(సంతోష్ శోభన్)లకేమో ఒకళ్ళంటే మరొకరికి పడదు. దానికి అద్భుతమైన కారణం ఉంటుంది. తర్వాత జరిగేది ఈజీగా ఊహించుకోవచ్చు.
వైవిధ్యం మచ్చుకు కూడా కనిపించకుండా స్టోరీ రాసుకున్న ప్రశాంత్ కుమార్ దిమ్మల ఇప్పటికే కొన్ని వందలసార్లు వచ్చిన సీన్లను వాడేసి వాటినే తిరగమోత వేసుకుని ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. అక్కడక్కడా కామెడీతో పాటు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినప్పటికీ అవేవీ కనీస స్థాయిలో కాపాడలేకపోయాయి. మంచి క్యాస్టింగ్ ఉన్నా వృథా అయిపోయింది.
అవసరం లేని సీన్లు వస్తూనే ఉంటాయి. స్టోరీ ఎంత రొటీన్ గా ఉన్న రాతలో కొంతైనా ఫ్రెష్ నెస్ ఉంటేనే జనం చూస్తారు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని పేరున్న సుస్మిత ఇంత బ్లైండ్ గా దీన్ని ఎలా ఓకే చేశారో మరి
This post was last modified on February 19, 2023 7:15 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…