ఈ శుక్రవారం రిలీజుల్లో సార్ దూసుకుపోతోంది. కేవలం రెండు రోజులకే 10 కోట్ల దాకా గ్రాస్ రావడం గతంలో ధనుష్ కి ఎప్పుడూ జరగలేదు. తిరు తెలుగు వెర్షన్ కు వరల్డ్ వైడ్ వచ్చిన ఫైనల్ గ్రాస్ ని సార్ కేవలం ఫస్ట్ డేనే అందుకుంది.
శనివారం వసూళ్లలో సుమారు నలభై శాతం పెరుగుదల ఉండటం మౌత్ టాక్ ఎంత బలంగా పని చేస్తోందో చూపిస్తోంది. వినరో భాగ్యము విష్ణుకథలో ఉన్న బలహీనతలు సార్ కు ప్లస్ గా మారుతున్నాయి. మరోవైపు శ్రీదేవి శోభన్ బాబుకి డిజాస్టర్ టాక్ రావడంతో స్క్రీన్లు తక్కువున్న చాలా చోట్ల దాన్ని తీసేసి మరీ ధనుష్ మూవీకి ఇచ్చేస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ మార్కెట్ లో ధనుష్ స్టామినా సరిగ్గా ఇప్పుడు బయట పడింది. గతంలో రఘువరన్ బిటెక్ లాంటి సూపర్ హిట్ ఉన్నప్పటికీ తర్వాత వచ్చినవేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. జాతీయ అవార్డు సాధించిన ఆడుకాలం ఇక్కడ పందెం కోళ్లుగా అనువదిస్తే విడుదలలో జాప్యం వల్ల ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది.
అసురన్ కు మంచి అవకాశం ఉన్నా దాన్ని వెంకటేష్ నారప్పగా రీమేక్ చేసుకోవడంతో అదీ మిస్ అయ్యింది. వడ చెన్నైలో నేటివిటీ సమస్య కారణంగా ఇక్కడి నిర్మాతలు డబ్ చేసే ధైర్యం చేయలేకపోయారు.
ఫైనల్ గా ఇప్పుడు సార్ రూపంలో సరైన హిట్టు దక్కింది. ఫైనల్ రన్ అయ్యేలోపు చాలా సులభంగా ఇరవై కోట్ల గ్రాస్ ని చేరుకోవడం ఖాయమేనని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇంకో మూడు వారాల దాకా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ రిలీజులు లేవు.
సో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇదే బెటర్ ఆప్షన్ గా నిలుస్తుంది. సిటీస్ మినహాయించి వినరో భాగ్యము విష్ణుకథకు బిసి సెంటర్లలో ఆశించిన స్పందన కనిపించడం లేదని బయ్యర్ రిపోర్ట్. ఒకవేళ స్లో పికప్ ఉంటుందనుకున్నా సార్ తో పోటీ పడాలంటే ఈ స్పీడ్ సరిపోదు. రాబోయే వారం రోజులు రెండు యూనిట్లు పోటాపోటీగా ప్రమోషన్లు ప్లాన్ చేసుకుంటున్నాయి
This post was last modified on February 19, 2023 5:54 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…