Movie News

బాక్సాఫీస్‌కు కళ వచ్చింది

సంక్రాంతి సినిమాల సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఇది ప్రతి ఏడాదీ జరిగే విషయమే. పండుగ సినిమాలు రెండు వారాలు సందడి చేశాక ఒక రకమైన స్తబ్దత నెలకొని తర్వాత వచ్చే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడుతుంటాయి. ఈసారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. ఒక్క ‘రైటర్ పద్మభూషణ్’ అనే చిన్న సినిమా మినహాయించి గత నెల రోజుల్లో ఇంకే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేదు.

చాలా సినిమాలు రిలీజైన సంగతి కూడా తెలియనట్లుగా వచ్చి వెళ్లిపోయాయి. ఇలాంటి టైంలో మహా శివరాత్రి పండుగ వీకెండ్ మీద ప్రేక్షకుల దృష్టి నిలిచింది. ఈ వారాంతంలో ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’తో పాటు గీతా ఆర్ట్స్ బేనర్లో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాణంలో సంతోష్ శోభన్ హీరోగా చేసిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ రిలీజయ్యాయి.

ఐతే వీటిలో ‘శ్రీదేవి శోభన్ బాబు’ను ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ మిగతా రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ‘సార్’ ప్రేక్షకుల మనసు దోచినట్లే కనిపిస్తోంది. ‘తొలి ప్రేమ’ తర్వాత ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకీ అట్లూరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

హిందీ సినిమా ‘సూపర్ 30’ స్ఫూర్తితో అతను ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కనిపిస్తోంది. ఐతే కథ మరీ కొత్తగా లేకపోయినా.. కథనంలో కూడా సర్ప్రైజులేమీ లేకపోయినా.. సిన్సియర్‌గా ఈ కథను చెప్పిన విధానం.. ఎమోషన్లను పండించిన తీరు.. అన్నింటికీ మించి ధనుష్ సూపర్ పెర్ఫామెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఒక స్ట్రెయిట్ మూవీ తరహాలో ‘సార్’ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

రెండు రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందంటే సినిమా మంచి విజయం దిశగా వెళ్తోందని అర్థం చేసుకోవచ్చు. శుక్రవాం రిలీజైన ఈ చిత్రం ఆ రోజు సాయంత్రం నుంచి హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. ఇక శనివారం రిలీజైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’కు టాక్ అంత గొప్పగా లేదు కానీ.. ఇది తీసిపడేయదగ్గ సినిమా అయితే కాదు. ఇందులో కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. కొన్ని లూప్ హోల్స్ ఉన్నప్పటికీ.. ట్విస్టులు పేలడం, సినిమా బోర్ కొట్టించకపోవడంతో ప్రేక్షకులేమీ రిగ్రెట్ కావట్లేదు. ఈ చిత్రానికి తొలి రోజు ఈవెనింగ్, నైట్ షోలకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. చూస్తుంటే ఇది కూడా సక్సెస్ ఫుల్ సినిమానే అయ్యేలా ఉంది. మొత్తానికి సంక్రాంతి తర్వాత థియేటర్లు మళ్లీ కళకళలాడుతుండడం టాలీవుడ్లో ఉత్సాహం నింపుతోంది.

This post was last modified on February 19, 2023 4:40 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కూట‌మి మేనిఫెస్టో.. సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే!

తాజాగా ఏపీలో కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీలు మేనిఫెస్టో విడుద‌ల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్ర‌బాబు చెబుతున్న…

7 hours ago

ఉమ్మడి మేనిఫెస్టో.. బీజేపీ దూరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…

8 hours ago

ప్రేమికుడుని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు

దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…

8 hours ago

పరశురామ్‌కు దిద్దుకోలేనంత డ్యామేజీ

యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…

10 hours ago

ఉద్యోగాలపై ఇదేం లాజిక్ జగన్ సార్?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…

12 hours ago

కమల్ సినిమాకు కమల్ సినిమా సంకటం

లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…

12 hours ago