నందమూరి బాలకృష్ణ కెరీర్లో ‘అఖండ’ చాలా ప్రత్యేకమైన చిత్రం. యన్.టి.ఆర్-1, యన్.టి.ఆర్-2, రూలర్ లాంటి డిజాస్టర్లతో ఆయన కెరీర్ పాతాళానికి పడిపోయిన సమయంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం అసాధారణ విజయాన్ని అందుకుంది.
సంచలన ఓపెనింగ్స్‌తోనే కాక.. లాంగ్ రన్‌తో ఈ చిత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. బాలయ్య కెరీర్లో కలెక్షన్ల పరంగా అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది. రెండు మూడు వీకెండ్లకు మించి సినిమాలు నిలబడని రోజుల్లో నెల తర్వాత కూడా మంచి వసూళ్లతో సాగిందీ చిత్రం.
బాలయ్య అభిమానులనే కాక అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం అలరించింది. దీని తర్వాత ‘వీర సింహారెడ్డి’ కూడా హిట్ అయినప్పటికీ.. ‘అఖండ’ మాత్రం బాలయ్య అభిమానులకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఇంతకుముందే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ప్రచారం కాదని.. సీక్వెల్ పక్కా అని అర్థమవుతోంది.
‘అఖండ’కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి ఆ సినిమా ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు తమన్ ‘అఖండ-2’ గురించి హింట్ ఇచ్చాడు. మహా శివరాత్రి సందర్భంగా అతను శుభాకాంక్షలు చెబుతూ అఖండలో శివతత్వాన్ని చాటే వీడియోను పంచుకున్నాడు.
ఈ సందర్భంగా ‘అఖండ-2’తో కలుద్దాం అని కూడా పేర్కొన్నాడు. అంటే ‘అఖండ-2’ కచ్చితంగా ఉంటుందని.. అది త్వరలోనే మొదలువుతుందని తమన్ హింట్ ఇస్తున్నట్లే. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నాడు. అది ఈ ఏడాది దసరాకి రిలీజవుతుందని అంటున్నారు.
ఆ తర్వాత బాలయ్య ఏ సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటీ లేదు. మరోవైపు బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అది ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజయ్యేలా కనిపిస్తోంది. వేరే కమిట్మెంట్లు లేకపోతే ఈ ఏడాది చివర్లో బాలయ్య-బోయపాటి కలయికలో అఖండ-2 పట్టాలెక్కేలా కనిపిస్తోంది.
This post was last modified on February 19, 2023 4:32 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల…
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన…
వైసీపీ అధినేత జగన్ తన బ్రిటన్ పర్యటన ముగించుకుని చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు. వాస్తవానికి ఆయన నాలుగు…
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…