నందమూరి తారకరత్న కన్నుమూశారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం రోజున ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి ఆయనకు బెంగళూరులో వైద్యం అందుతోంది.
పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించారు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విదేశాల నుంచి కూడా వైద్యులను రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
విదేశాల నుంచి రప్పించిన వైద్యులు కూడా తారకరత్నకు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని తొలుత భావించినా పరిస్థితి మెరుగుపడగా శివరాత్రి రోజున ఆయన కన్నుమూశారు. తారకరత్న మరణ వార్తతో సినీ లోకంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. నందమూరి ఫ్యామిలీకి పలువురు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు.
శనివారం ఉదయం నుంచే నందమూరి కుటుంబసభ్యులు, టీడీపీ నాయకులు బెంగళూరులోని ఆసుపత్రికి వెళ్లివస్తుండడంతో అంతటా అనుమానాలు కనిపించాయి. రాత్రి సమయానికి ఆయన మరణించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
తారకరత్న సినీ కెరీర్ తరువాత కొద్దినెలలుగా రాజకీయంగా యాక్టివ్‌గా మారారు. చంద్రబాబు, లోకేశ్ కూడా తారకరత్నను ప్రోత్సహించడంతో ఆయన ఏపీలోని కొన్ని నియోజకవర్గాలలో తిరుగుతూ స్థానిక నాయకులను కలుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన లోకేశ్‌తో పాదయాత్రలోనూ పాల్గొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates