వేరే భాషల హీరోలు తమ చిత్రాల ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చినపుడల్లా.. తెలుగు ప్రేక్షకులను కొనియాడుతుంటారు. వాళ్లకు భాషా భేదం ఉండదని.. సినిమా బాగుంటే ఎవరిదైనా చూస్తారని.. గొప్పగా ఆదరిస్తారని అంటుంటారు. వాళ్లు మాట వరసుకు అంటారో, మనస్ఫూర్తిగా అంటారో తెలియదు కానీ.. ఆ మాటలు మాత్రం అక్షరాలా నిజం. దేశంలో తెలుగు ప్రేక్షకులకు ఉన్నంత విశాల హృదయం ఇంకెవరికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. సినిమాను అమితంగా ప్రేమించే మన ప్రేక్షకులు ఏ భాష నుంచి మంచి సినిమా వచ్చినా నెత్తిన పెట్టుకుంటారు.
‘కాంతార’ సినిమా ఇతర భాషల్లోనూ బాగా ఆడింది కానీ.. తెలుగులో ఆ చిత్రం ఏకంగా 50 కోట్ల వసూళ్లు సాధించడం అనూహ్యం. మనవాళ్లకు నచ్చితే ఏ భాషా చిత్రాన్నయినా ఎలా ఆదరిస్తారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
తాజాగా ధనుష్ ‘సార్’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టాడు. ధనుష్ స్థాయిలో ఉన్న టాలీవుడ్ హీరో సినిమా ఏదైనా తమిళంలో రిలీజైతే ఏమాత్రం పట్టించుకుంటారు అన్నది సందేహమే. కానీ మన వాళ్లకు అలాంటి భేదం ఏమీ ఉండదు. ధనుష్‌కు ఇక్కడ పెద్ద ఫాలోయింగ్ ఏమీ లేకపోయినా.. మన దర్శకుడితో, మన నిర్మాత తీసిన సినిమా కావడంతో ‘సార్’ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.
ధనుష్ చిత్రానికి తెలుగులో ముందు రోజే ప్రిమియర్స్ పడడం.. అవన్నీ హౌస్ ఫుల్స్ కావడం అనూహ్యం. ఇక రిలీజ్ రోజు కూడా సినిమాకు మంచి టాక్ వచ్చింది తెలుగులో. తమిళ హీరో సినిమా అని ఎవ్వరూ దాన్ని తక్కువ చేయడానికి చూడలేదు. సోషల్ మీడియాలో కూడా అందరూ పాజిటివ్‌గానే మాట్లాడారు. తొలి రోజు ‘సార్’కు తెలుగులో 5 కోట్ల దాకా వసూళ్లు రావడం విశేషం. పాజిటివ్ టాక్‌తో సినిమా మంచి రేంజికే వెళ్లేలా కనిపిస్తోంది. ఈ స్పందన చూసి తెలుగు ప్రేక్షకులు సూపర్ అని ధనుష్ సహా కోలీవుడ్ జనాలందరూ అనుకుంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on February 18, 2023 10:40 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…