ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ 2024 సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయనే ఊహాగానాలు కొనసాగుతూ ఉండగానే ఇవాళ హఠాత్తుగా ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ని జనవరి 12 ప్రకటించేయడం అభిమానులను సైతం షాక్ కి గురి చేసింది. ఎందుకంటే రాబోయే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆది పురుష్, సలార్ లు రాబోతున్న నేపథ్యంలో దాని తర్వాత కేవలం నాలుగు నెలల గ్యాప్ లో ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీని షెడ్యూల్ చేశారంటే నమ్మశక్యం కాదంటున్నారు. ముందస్తు జాగ్రత్త కోసం అనౌన్స్ చేశారా లేక నిర్మాత అశ్వినిదత్ కృత నిశ్చయంతో ఉన్నారా అనేది సస్పెన్స్
ఒక్క కొత్త పోస్టర్ తో ఇవాళ అఫీషియల్ గా చెప్పేశారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రభాస్ రాకను ముందుగా చెప్పడం వల్ల వైజయంతి సంస్థ చాలా తెలివైన ఎత్తుగడ వేసింది. ఎందుకంటే రామ్ చరణ్ శంకర్ ల కాంబో మూవీ అదే సీజన్ ని లక్ష్యంగా పెట్టుకుని షూటింగ్ జరుపుకుంటోంది. అయితే నిర్మాత దిల్ రాజు ఆ విషయం ఎక్కడా చెప్పడం లేదు. ట్విట్టర్ లో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఊహాగానాలే తప్ప నిజంగా ఆ నెలలోనే వస్తుందా అంటే ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సైతం కమర్షియల్ గా వర్కౌట్ కావాలంటే అదే సంక్రాంతే బెస్టని ఫీలవుతోందట.
మరి ప్రాజెక్ట్ కె ఎంత మంది ఇతను ప్రొడ్యూసర్లు సీరియస్ గా తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇప్పుడు చెప్పినంత మాత్రాన ప్రాజెక్ట్ కె ఆ మాట మీదే ఉంటుందని గ్యారెంటీ లేదు. ఇది ప్రతి ప్రభాస్ సినిమాకు జరిగేదే. ఇంకా చాలా టైం పడుతుందని ఎదురు చూస్తున్న సమయంలో ఇలా సడన్ ట్విస్టు ఇవ్వడం ఎవరూ ఊహించలేదు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ సీనియర్లు నటిస్తున్నారు. నిజంగా ప్రాజెక్ట్ కె కనక దీనికే కట్టుబడితే మిగిలినవాళ్లు వీలైనంత త్వరగా అలెర్ట్ అవ్వడం అవసరం. లేదంటే లేనిపోని ఇబ్బందులు వచ్చేస్తాయి