Movie News

మూడు శుక్రవారాలు చిన్న సినిమాలకు వదిలేశారు

ఎన్నిసార్లు మొత్తుకున్నా రిలీజుల విషయంలో టాలీవుడ్ నిర్మాతల పోటీ ధోరణి మాత్రం మారడం లేదు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. ఈ ఫ్రైడే సార్, వినరో భాగ్యము విష్ణు కథలతో మూవీ లవర్స్ కి మంచి ఆప్షన్లు ఉండగా రాబోయే మూడు వారాల్లో మాత్రం చెప్పుకోదగ్గ విడుదల ఏదీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫిబ్రవరి 24 నోటెడ్ రిలీజులంటూ పెద్దగా లేవు. ప్రమోషన్ల పరంగా మిస్టర్ కింగ్ ఒక్కటే కొంత ఆసక్తిని రేపుతోంది కానీ క్యాస్టింగ్ వల్ల దాని మీద ఆడియన్స్ దృష్టి ఎంతమేరకు ఉంటుందో చెప్పలేం.

మార్చి 3న దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన బలగం కంటెంట్ ని నమ్ముకుని వస్తోంది. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమవుతున్న సీరియస్ మూవీ ఉంది. ఎస్వి కృష్ణారెడ్డి చాలా కాలం తర్వాత దర్శకత్వం వహించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు కూడా అదే రోజే. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించగా బిగ్ బాస్ సోహైల్ హీరో. మార్చి 10న ఆది సాయికుమార్ సిఎస్ఐ సనాతన్ అనే క్రైమ్ థ్రిల్లర్ ని దింపుతున్నారు. మెన్ టూ అనే మరో కామెడీ మూవీ కూడా ఉంది. అంతో ఇంతో బజ్ ఉన్నవాటి గురించే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

మళ్ళీ మార్చి 17న ఉపేంద్ర కిచ్చ సుదీప్ ల కబ్జా, నాగ శౌర్యల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో సందడి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇలా షెడ్యూల్ అయ్యాయి కానీ పైన చెప్పినవాటిలో చివరి నిమిషం వరకు ఏమైనా అనూహ్య మార్పులు ఉన్నా ఆశ్చర్యం లేదు. వినరో భాగ్యము లాంటివి ఒక వారం ఆగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కాని శివరాత్రి పండగతో పాటు వీకెండ్ ని లక్ష్యంగా పెట్టుకోవడంతో దీనికన్నా బెటర్ ఆప్షన్ కనిపించి ఉండకపోవచ్చు. మొత్తానికి మూడు శుక్రవారాలు బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేసేలా లేవు. ఏవైనా అనూహ్యంగా విజయం సాధించి జోష్ తేవాల్సిందే.

This post was last modified on February 17, 2023 11:39 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago