కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ లాగే తెలుగు దర్శకుడైన వెంకీ అట్లూరితో తమిళ, తెలుగు భాషల్లో సినిమా చేశాడు ధనుష్. అదే.. సార్. ఈ సినిమాకు కొన్ని రోజుల ముందు వరకు పెద్దగా బజ్ కనిపించలేదు. అసలు ఈ చిత్రం ఫిబ్రవరి 17న రిలీజవుతుందా లేదా అనే సందేహాలు రేకెత్తించేలా ప్రమోషన్లను అస్సలు పట్టించుకోలేదు చిత్ర బృందం. కానీ రిలీజ్ దగ్గరికొచ్చేసరికి పరిస్థితి మారింది. అగ్రెసివ్ ప్రమోషన్లు సినిమాకు కలిసొచ్చాయి.
సినిమా మీద ధీమాతో ముందు రోజు ప్రిమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు. ముందు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో రెండు షోలు ఓపెన్ చేశారు. అవి చకచకా ఫిల్ అయిపోయి సోల్డ్ ఔట్ బోర్డులు పడిపోయాయి. సినిమా మీద జనాలకు మంచి అంచనాలే ఉన్నట్లున్నాయే అని.. సిటీలో మరిన్ని మల్టీప్లెక్సుల్లో షోలు ఒక్కొక్కటిగా మొదలుపెట్టారు. ఇలా పెట్టిన షోలు పెట్టినట్లే ఫిల్ అయిపోయాయి.
ఇంకా వైజాగ్, విజయవాడ లాంటి పలు నగరాల్లో ప్రిమియర్ షోలకు బుకింగ్స్ ఓపెన్ చేయడం.. అవి చకచకా ఫిల్ అయిపోవడం.. ఇదీ వరస. మొత్తంగా తెలుగులో ధనుష్ సినిమాకు పదుల సంఖ్యలో రిలీజ్ ముందు రోజే ప్రిమియర్ షోలు పడుతున్నాయి. అవన్నీ కూడా దాదాపుగా హౌస్ ఫుల్స్‌తో నడుస్తున్నాయి.
రజినీ, కమల్, సూర్య, కార్తి లాంటి హీరోలతో పోలిస్తే ధనుష్‌కు తెలుగులో ఫాలోయింగ్ తక్కువే. అతనిక్కడ స్టార్ ఏమీ కాదు. అలాంటి హీరో సినిమాకు ఇన్ని ప్రిమియర్ షోలు పడడం.. అవన్నీ హౌస్ ఫుల్ కావడం విశేషమే. ఈ షోలకు పాజిటివ్ టాక్ వస్తే.. తొలి రోజు కూడా సినిమా మంచి ఆక్యుపెన్సీలతో నడిచే ఛాన్సుంది. ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయి. తెలుగులో డెబ్యూ మూవీతోనే ధనుష్ మంచి హిట్ అందుకునే అవకాశాలున్నాయి. చూద్దాం మరి టాక్ ఎలా ఉంటుందో?
This post was last modified on February 17, 2023 10:12 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…