ఆదిపురుష్ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు పెట్టుకున్న అంచనాలు వేరు. కానీ ఈ సినిమా టీజర్లో కనిపించింది వేరు. ఇప్పటికే చాలాసార్లు వెండితెరపై చూసిన రామాయణ గాథను అధునాతన టెక్నాలజీని వాడుకుని సరికొత్తగా, ఇంకా గొప్పగా ప్రెజెంట్ చేస్తారని అనుకుంటే.. క్రియేటివిటీ హద్దులు దాటిపోయి, టీజర్ అంతటా అసహజత్వం నిండిపోవడంతో ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
డ్యామేజ్ కంట్రోల్ కోసం చిత్ర బృందం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మీడియా వాళ్లకు ప్రత్యేకంగా త్రీడీ టీజర్ ప్రదర్శించినా కూడా నెగెటివిటీ తగ్గలేదు. ఉన్నదున్నట్లుగా సినిమాను రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాభవం తప్పదని అర్థమైపోయి.. చిత్ర బృందం వెనక్కి తగ్గింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మళ్లీ వర్క్ చేసి సినిమా లుక్ మార్చక తప్పదని ఫిక్సయ్యారు. ముందు అనుకున్నదానికంటే ఐదు నెలలు ఆలస్యంగా జూన్ 16న ‘ఆదిపురుష్’ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇక అప్పట్నుంచి ‘ఆదిపురుష్’ గురించి చప్పుడు లేదు. తన వరకు సినిమా కోసం చేయాల్సిందేమీ లేకపోవడంతో ప్రభాస్.. వేరే ప్రాజెక్టుల మీద పడిపోయాడు. ఐతే ‘ఆదిపురుష్’ కొత్తగా ప్రకటించిన రిలీజ్ డేట్‌ను కూడా అందుకోవడం కష్టమే అన్నది తాజా సమాచారం.
విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చిన్న చిన్న కరెక్షన్లు చేస్తే సరిపోదని.. మార్పులు చేర్పులు పెద్ద ఎత్తునే చేయాల్సి ఉందని.. విలన్ సైఫ్ అలీఖాన్, హనుమంతుడు పాత్రధారుల లుక్స్ మార్చి వారి మీద కొన్ని సన్నివేశాలను రీషూట్ కూడా చేస్తున్నారని.. సినిమాలో చూపించిన కోతులు, ఇతర జీవరాశుల ఆకృతులను కూడా మారుస్తున్నారని.. ఇందుకోసం చాలా టైం పట్టేలా ఉండడంతో జూన్ 16న సినిమా రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు.
పైగా అదే తేదీకి మార్వెల్ వారి ‘ఫ్లాష్’ సినిమా రానుండడంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ తప్పదు. దాని వల్ల వసూళ్ల మీద గట్టి ప్రభావం పడుతుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని సినిమాను మరోసారి వాయిదా వేయడం పక్కా అని అంటున్నారు.
This post was last modified on February 16, 2023 7:55 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…