ఈ రోజుల్లో ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా అయినా రెండో వీకెండ్‌ను మించి బాక్సాఫీస్ దగ్గర నిలబడడం కష్టమే. తొలి వీకెండ్లో మాగ్జిమం వసూళ్లు రాబట్టి.. ఆ తర్వాత ఓ మోస్తరు కలెక్షన్లతో సాగుతుంటాయి కొత్త సినిమాలు. శత దినోత్సవాలు, అర్ధ శతదినోత్సవాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోగా.. కొన్ని సెంటర్లలో అయినా ఓ 25 రోజులు ఆడడం కష్టమైపోతోంది. ఐతే ఈ వారాంతంలో విడుదల కానున్న ‘సార్’ సినిమా తెలుగులో నాలుగైదు వారాలు నిలకడగా వసూళ్లు రాబడుతుందని.. తమిళంలో ఈ చిత్రం ఎనిమిది వారాలు ఆడుతుందని దాని దర్శకుడు వెంకీ అట్లూరి ధీమా వ్యక్తం చేయడం విశేషం. ముందు నటుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత ‘తొలి ప్రేమ’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా మారిన వెంకీ.. తొలి చిత్రం తర్వాత తనపై పెరిగిన అంచనాలను అందుకోలేకపోయాడు. అతడి మలి చిత్రాలు మిస్టర్ మజ్ను, రంగ్ దె సరిగా ఆడలేదు.
వెంకీ నాలుగో చిత్రం ‘సార్’కు కూడా విడుదల ముంగిట మరీ బజ్ ఏమీ లేదు. విడుదల దగ్గర పడ్డాక ప్రమోషన్లు బాగానే ఉన్నాయి కానీ.. మధ్యలో ఈ చిత్రాన్ని పట్టించుకోకుండా వదిలేయడం మైనస్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ఓ మోస్తరుగా అనిపించిందంతే. కానీ సినిమా మీద వెంకీ మాత్రం చాలా ధీమాగానే ఉన్నట్లున్నాడు. ‘సార్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను మాట్లాడుతూ.. ‘‘నా తొలి సినిమా ‘తొలి ప్రేమ’ తర్వాత మళ్లీ ఇప్పుడు ధీమాగా చెబుతున్నా. ‘సార్’ సినిమా కేవలం ఫిబ్రవరి 17, 18, 19 తేదీల వరకు మాత్రమే కాదు.. నాలుగైదు వీకెండ్లు బాగా ఆడుతుంది.
తొలి వీకెండ్లో మాదిరే ఆ తర్వాత కూడా ఆడుతుంది. తమిళంలో అయితే ఈ సినిమా 8 వారాలు ఆడుతుంది. రాసిపెట్టుకోండి’’ అని చెప్పాడు. ఐతే సినిమాకు హైప్ పెంచడానికి వెంకీ ఈ మాట చెప్పాడా.. లేక నిజంగానే సినిమాలో అంత విషయం ఉందా అన్నది ఇంకొక్క రోజు వ్యవధిలో తేలిపోతుంది.
This post was last modified on February 16, 2023 1:07 pm
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…