ఎంతైనా డాన్సుల గురించి చెప్పుకోవాలంటే మన సౌత్ హీరోల తర్వాతే ఎవరైనా. చిరంజీవితో మొదలుపెట్టి ఇప్పటి చరణ్ తారక్ బన్నీ ఇలా ఎవరిని తీసుకున్నా వీళ్ళ స్పీడు ముందు ఎవరైనా దిగదుడుపే. రామ్ సైతం ఈ విషయంలోనే మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అయితే బాలీవుడ్ బ్యాచ్ మాత్రం దశాబ్దాల తరబడి ఇందులో మాత్రం వెనుకాడే ఉంది. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్, ముగ్గురు ఖాన్లు, అక్షయ్ కుమార్ ఇలా ఎందరు వచ్చినా మన గ్రేస్ లో కనీసం సగం కూడా అందుకోలేకపోయారు.
ఒక్క హృతిక్ రోషన్ మాత్రమే మినహాయింపుగా చెప్పాలి. ఇటీవలి కాలంలో టైగర్ శ్రోఫ్, రణ్వీర్ సింగ్ లాంటి వాళ్ళు బాగానే ట్రై చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే సల్మాన్ ఖాన్ కొత్త సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్ ఈ ఏడాది రంజాన్ కానుకగా రిలీజయ్యేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టారు. హీరోయిన్ అన్నయ్యగా వెంకటేష్ ఓ కీలక పాత్ర చేయడంతో విక్టరీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది కానీ అదెంతవరకు నిజమో బొమ్మ చూస్తే కానీ చెప్పలేం.
ఈ మూవీ నుంచి తాజాగా నైయో లగ్దా అనే పాటను విడుదల చేశారు. పూజా హెగ్డే కండల వీరుడి జోడిగా నటించింది. ఇందులో సల్మాన్ వేసిన ఒక స్టెప్పు మంచి ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయింది. సుతారంగా కిందకు కూర్చుని మళ్ళీ పైకి లేస్తూ ఏదో హిట్లర్ టైపులో ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. పైగా దానికి తోడు జులపాల జుట్టుతో విగ్గేసుకుని ట్రై చేసిన కొత్త లుక్ కూడా ఏమంత ఆకర్షణీయంగా లేదు. మొత్తానికి సౌత్ సినిమాల ట్రాప్ లో పడిపోయిన సల్మాన్ కథలు పాత్రలతో పాటు ఆఖరికి డాన్సులు కూడా కాపీ చేస్తే ఎలా అని నెటిజెన్లు దెప్పిపొడుస్తున్నారు. నిజాన్ని ఎవరు మాత్రం కాదనగలరు.
This post was last modified on February 14, 2023 3:06 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…