రాబోయే వేసవి సీజన్లో మాస్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న మొదటి సినిమాగా దసరాకు క్రేజ్ అంతకంతా పెరుగుతోంది. ఆ మధ్య జరిగిన టీజర్ లాంచ్ లో నాని ఏకంగా దీన్ని కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప రేంజ్ లో ఉంటుందని ఊరించేయడంతో ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకుంటున్నారు. అయినా రిలీజయ్యాక ఫలితం మాట్లాడితే బాగుంటుంది కానీ ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో స్టేట్మెంట్లు ఇవ్వడమేంటని నెటిజెన్లు గట్టిగానే తగులుకున్నారు. ఇవి నాని దాకా వెళ్లాయి. నిన్న జరిగిన సాంగ్ రిలీజ్ వేడుకలో దీని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
బడ్జెట్ లో కానీ స్కేల్ లో కానీ పుష్ప కెజిఎఫ్ లాంటి వాటితో దసరాకు పోలిక ఉండదని ఇది కేవలం కంటెంట్ పరంగా ఆ స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పడమే తప్పించి మరో కారణం లేదని తేల్చి చెప్పాడు. ఈ వెర్షన్ కన్విసింగ్ గానే ఉంది. ఎందుకంటే కేవలం పదహరు కోట్లతో తీసిన కాంతార మూడు వందల కోట్లు వసూలు చేసినప్పుడు దసరా మీద ఆ మాత్రం నమ్మకం పెట్టుకోవడం న్యాయమే. కాకపోతే మరీ ఓవర్ ది బోర్డు మాటలు చెప్పకుండా వీలైనంత తక్కువ ప్రొఫైల్ లో హీరో ప్రమోట్ చేసుకుంటే బెటర్. పబ్లిసిటీని ఎలా పీక్స్ కు తీసుకెళ్ళాలో దర్శక నిర్మాతలు చూసుకుంటారు.
కెరీర్ లోనే మొదటిసారి ఊర మాస్ మేకోవర్ కు వెళ్లిన నాని దసరా వల్ల పెద్ద సవాళ్ళే ఎదురు కానున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్ డ్రామాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కథను అల్లారు కాబట్టి వీలైనంత గొప్పగా ఆడియన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా పైన చెప్పినట్టు పుష్పని కాపీ కొట్టారనే కామెంట్లు వచ్చి పడతాయి. వీటి సంగతి ఎలా ఉన్నా ఏరియాల వారీగా బిజినెస్ మాత్రం క్రేజీగా జరిగిపోతోంది. ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ ఆల్రెడీ కొనేసింది. నాని రేంజ్ కి మించి ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ సులభంగా టేబుల్ ప్రాఫిట్స్ అందుకోబోతున్నారట.
This post was last modified on February 14, 2023 10:42 am
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…