బాలీవుడ్లో చాలా కొద్ది మంది టాప్ స్టార్లు మినహాయిస్తే అందరూ హీరోలూ వెబ్ సిరీస్‌లు చేస్తున్న వాళ్లే. కానీ దక్షిణాదిన ఇంకా స్టార్ హీరోలు అటు వైపు చూడట్లేదు. తెలుగులో ఈ దిశగా ముందడుగు వేస్తున్నది సీనియర్ హీరో విక్టరీ వెంకటేషే. తన అన్న కొడుకు రానాతో కలిసి వెంకీ రానా నాయుడు అనే సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. గత ఏడాదే అనౌన్స్ అయిన ఈ సిరీస్.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఈ సిరీస్ గురించి సౌండ్ లేదు.
ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రానా నాయుడు రిలీజ్ అప్‌డేట్ అడుగుతున్నా.. దీన్ని ప్రొడ్యూస్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ సైలెంటుగా ఉంది. కాగా ఇప్పుడు స్వయంగా వెంకీనే రానా నాయుడు ప్రమోషన్లను కొంచెం వెరైటీగా మొదలుపెట్టి.. రిలీజ్ గురించి హింట్ ఇచ్చాడు.
తన అరంగేట్ర సిరీస్‌కు రానా నాయుడు అనే టైటిల్ పెట్టడం పట్ల వెంకీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెట్ ఫ్లిక్స్ వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం విశేషం. రానా నాయుడు కోసం తాను ఎత్తిన కొత్త అవతారంలో గన్ను పట్టుకుని ఉన్న వీడియోను పోస్టు చేస్తూ.. చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ నెట్ ఫ్లిక్స్.. రానా నాయుడులో హీరో ఎవరు? నేను. అందరికంటే పెద్ద స్టార్ ఎవరు? నేను. అందంగా కనిపించేది నేనే. ఫ్యాన్స్ కూడా నావాళ్లే. కాబట్టి షోకి రానా నాయుడు అని కాకుండా నాగా నాయుడు అని టైటిల్ ఉండాలి. నాతో మజాక్ వద్దు అని కామెంట్ జోడించాడు వెంకీ.
ఈ వీడియోను వెంకీ, రానాల సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కూడా రీట్వీట్ చేసింది. ఈ సిరీస్‌లో వెంకీ వయొలెంట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర లక్షణాల్ని చాటేలా వెరైటీగా వెంకీ ప్రమోషన్ మొదలుపెట్టినట్లున్నాడు. ఇలా ప్రమోషన్లు మొదలయ్యాయంటే త్వరలోనే సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లే.
This post was last modified on February 13, 2023 11:12 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…