తెలుగు వాళ్లే కాక దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. డివైడ్ టాక్‌ను తట్టుకుని సూపర్ హిట్ అయిన ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆ సినిమా ఉత్తరాదిన సెన్సేషన్ క్రియేట్ చేయడం.. ఈ సినిమా పాటలు, బన్నీ మేనరిజమ్స్ అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ కావడంతో సెకండ్ పార్ట్‌కు హైప్ ఒక రేంజిలో ఉంది. అందుకే పార్ట్-2 స్క్రిప్టు మీద మరింత కసరత్తు చేసి కొంచెం లేటుగానే షూటింగ్ మొదలుపెట్టాడు దర్శకుడు సుకుమార్.
ఇటీవలే వైజాగ్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ‘పుష్ప-2’ టీం తాజాగా రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది. ఈ షెడ్యూల్ నిరవధికంగా మూడు వారాలకు పైగా కొనసాగనుందట. కొన్ని భారీ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట.
కాగా ఈ చిత్రంలో పుష్ప పాత్రకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. బన్నీ ఇందులో జపనీస్ భాష మాట్లాడనున్నాడట. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అతను అంతర్జాతీయ స్థాయికి ఎదగడం.. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్మగ్లర్లను డీల్ చేసేందుకు జపాన్ వెళ్లడం.. అక్కడికి వెళ్లే ముందు కాస్త జపనీస్ నేర్చుకుని.. అక్కడి వాళ్లతో ఆ భాషలోనే సంభాషించడం జరుగుతుందట. ఈ సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయని.. జపాన్ ఎపిసోడ్ సినిమాలో మేజర్ హైలైట్లలో ఒకటిగా ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇప్పటిదాకా జరిగిన షూటింగ్‌లో హీరోయిన్ రష్మిక పాల్గొనలేదు. కొత్త షెడ్యూల్లో ఆమెతో సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. పుష్ప-2లో ప్రధాన విలన్‌గా ఫాహద్ ఫాజిల్ కనిపించనుండగా.. జగపతిబాబు కూడా కొత్త విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది.
This post was last modified on February 13, 2023 10:58 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…