సౌత్ ఇండియన్ హీరోయిన్లలో నయనతారకున్న ఇమేజ్, ఫాలోయింగే వేరు. కేవలం నయన్ కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు లక్షల్లో ఉంటారు. ఆమె సినిమాలకు హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఈ మధ్య నయన్ కొంచెం డౌన్ అయినట్లు కనిపించినా ఆమె రేంజ్‌ను మాత్రం తక్కువ చేయలేం. ఆమెను చూసి మిగతా హీరోయిన్లకు అసూయ పుట్టడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే అందరూ తమ జెలసీని బయటపెట్టలేరు. మాళవిక మోహనన్ మాత్రం నయన్ విషయంలో ఈ మధ్య తన అక్కసును వెళ్లగక్కేస్తున్నట్లు కనిపిస్తోంది.
కొన్ని నెలల కిందట ఒక ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ.. నయన్ పేరెత్తకుండా ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఫుల్ మేకప్‌తో హాస్పిటల్ సీన్ చేసిందంటూ కౌంటర్లు వేసింది. దీనికి ఓ ఇంటర్వ్యూలో నయన్ నవ్వుతూ సమాధానం చెప్పింది. మాళవిక పేరెత్తకుండా ఆమె విమర్శించింది తననే అని చెబుతూ.. ఆ సీన్లో మేకప్ లేకుండా నటిస్తానన్నా దర్శకుడు ఒప్పుకోలేదని.. కమర్షియల్ సినిమాల్లో ఇలాంటివి కామన్ అని వివరణ ఇచ్చింది. ఈ సంగతి అలా ఉంచితే.. మాళవిక చేసిన తాజా వ్యాఖ్యలు నయనతార అభిమానులకు కోపం తెప్పించాయి.
హీరోయిన్ల పేరు ముందు ‘లేడీ సూపర్ స్టార్’ అని పెట్టడం తనకు నచ్చని.. వాళ్లను కూడా ‘సూపర్ స్టార్’ అనే పిలవాలని అంది మాళవిక. ఐతే ఈ వ్యాఖ్యల్లో నిజానికి తప్పుబట్టడానికి ఏమీ లేదు. నయన్‌ను టార్గెట్ చేసినట్లు కూడా లేకపోయినా.. ఆమె ఫ్యాన్స్ ఊరుకోలేదు. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ నయనే గుర్తుకు వస్తుంది. సినిమాల్లో ఆమె పేరు ముందు ఆ టైటిలే పడుతోంది. దీంతో నయన్‌ను ఉద్దేశించే మాళవిక ఈ వ్యాఖ్యలు చేసిందంటూ ఫ్యాన్స్ మాళవిక మీద మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మాళవిక వివరణ ఇచ్చింది. తాను జనరల్‌గా హీరోయిన్లందరినీ ఉద్దేశించి సానుకూల ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశానని.. నయనతార అంటే తనకు ఎంతో గౌరవమని.. ఆమెను కించపరిచే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని ఆమె చెప్పింది.
This post was last modified on February 13, 2023 10:56 pm
ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో…
భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34…
బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు…
క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ…
తెలంగాణ అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం చర్చల మధ్య తీవ్ర అభ్యంతరాలతో ముగిసింది. సభకు సంబంధించిన రోజులను…
మంచు కుటుంబ గత కొన్ని రోజులుగా కుటుంబ వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ వివాదంలో తాను కూడా భాగం అయినప్పటికీ…