హీరోయిన్లు తమ అందాలకు మెరుగులు దిద్దుకునే క్రమంలో సర్జరీలు చేసుకోవడం కొత్త కాదు. ముక్కు, పెదవులకు చిన్న చిన్న కరెక్షన్లు చేయించుకుని మరింత ఆకర్షణీయంగా తయారయ్యే ప్రయత్నం చేస్తుంటారు. శ్రీదేవి నుంచి శ్రుతి హాసన్ వరకు చాలామంది హీరోయిన్లు ఈ బాట పట్టిన వారే. ఐతే ఇలాంటి సర్జరీలు అందరికీ సెట్ కావు. వీటి వల్ల అందం పాడు చేసుకున్నవారు లేకపోలేదు.
ఆయేషా టకియా, తారా సుతారియా లాంటి హీరోయిన్లకు లిప్ సర్జరీలు తేడా కొట్టేసి అదోలా తయారవడం తెలిసిందే. ఇప్పుడు ఓ తెలుగు హీరోయిన్ ఇలాగే సర్జరీ ద్వారా తన అందాన్ని కాస్త దెబ్బ తీసుకున్నట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అమ్మాయే.. అనన్య నాగళ్ళ.
మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్ లాంటి చిత్రాలతో పాపులర్ అయిన అనన్యకు.. ఈ మధ్య పెద్దగా అవకాశాలు వస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉండే అనన్య.. తాజాగా ఒక హాట్ ఫొటో కమ్ వీడియో షూట్ చేసింది. అందులో చాలా హాట్‌గానే కనిపిస్తోంది కానీ.. తన లుక్ మాత్రం కొంచెం తేడా కొట్టినట్లు అనిపిస్తోంది. ముక్కుకి, పెదవులకు ఆమె సర్జరీలు చేయించుకున్న విషయంలో జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతోంది. క్లోజప్‌లో చూస్తే తను అనన్యయేనా అనే సందేహం కలిగే స్థాయిలో ఆమె లుక్ మారిపోయింది.
ప్రస్తుత లుక్‌తో పోలిస్తే పాత లుక్‌లోనే ఆమె బాగున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పెదవుల దగ్గర కొంచెం తేడా కొట్టినట్లుంది. కొత్త లుక్ చూసి ఎందుకీ ప్రయాస.. ముందే బావున్నావ్ కదా అంటూ నెటిజన్లు అనన్యకు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి రాబోయే సినిమాల్లో అనన్య దీని కంటే బెటర్‌గా కనిపిస్తుందేమో చూడాలి.
This post was last modified on February 13, 2023 10:53 pm
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…