ఆర్ఆర్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ పడ్డాక కెరీర్ ప్లానింగ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మరింత జాగ్రత్తతో మసలుతున్నాడు. అందుకే కొరటాల శివ చెప్పిన స్క్రిప్ట్ తనకు పూర్తి సంతృప్తినిచ్చే వరకు సెట్స్ పైకి వెళ్లకుండా నెలల తరబడి విలువైన సమయాన్ని ఖర్చు పెట్టాడు. దానికి తగ్గట్టే ఫైనల్ వెర్షన్ పర్ఫెక్ట్ గా వచ్చిందని, సముద్రం పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్స్ ప్లస్ యాక్షన్ పుష్కలంగా దట్టించి మిర్చిని మించిన టేకింగ్ ని శివ ఇందులో చూపిస్తారనే టాక్ ఆల్రెడీ ఉంది. అమిగోస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పిన ప్రకారం ఇంకో పది రోజుల్లో రెగ్యులర్ షూట్ మొదలుకావాల్సి ఉంది.
ఇంత జరుగుతున్నా ఈ ఎన్టీఆర్ 30కి హీరోయిన్ ఎవరో ఇప్పటిదాకా ఫైనల్ కాలేదు. నిన్నటిదాకా జాన్వీ కపూర్ అన్నారు. కానీ అటువైపు నుంచి పెద్దగా సంకేతాలు కనిపించడం లేదు. ఒకవేళ ఓకే అనుకున్నా వీలైనంత త్వరగా ప్రకటించేస్తే బెటర్. కానీ ఇంకా ఆ సూచనలు ఎక్కడా లేవు. కొత్తగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. సీతా రామంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఇక్కడ తొందరపడి సినిమాలు చేయడం లేదు. ఆచితూచి అడుగులు వెళ్తూ అన్ని లెక్కలు వేసుకుని నాని 30ని ఒప్పుకుంది. అందులో బిడ్డ తల్లిగా నటిస్తోందనే టాక్ ఉంది.
స్టార్ లీగ్ లోకి ఇంకా ఎంటర్ కాని మృణాల్ ని యంగ్ టైగర్ కోసం లాక్ చేస్తారా అనేది ప్రస్తుతానికి కేవలం ఊహాగానం మాత్రమే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా విలన్ కూడా ఫైనల్ కాలేదని మరో న్యూస్ ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. విక్రమ్, విజయ్ సేతుపతి, సైఫ్ అలీ ఖాన్ ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ అసలు ఎవరిని లాక్ చేస్తారో అంతుచిక్కడం లేదు. ఇలా కీలకమైన రెండు విషయాల మీద బుర్ర బద్దలు కొట్టుకుంటున్న కొరటాల శివ ఇవి తీరిపోతే కానీ మనఃశాంతిగా షూటింగ్ ని చేయలేరు. ఇవన్నీ ఒక ఎత్తయితే తమిళంలో మహా బిజీగా ఉన్న అనిరుద్ రవిచందర్ తో బెస్ట్ ట్యూన్స్ రాబట్టుకోవడం మరో సవాల్.
This post was last modified on February 13, 2023 10:44 pm
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…