ఒక –పెద్ద హీరో సినిమాల్లో ఇంకో పెద్ద హీరో క్యామియో రోల్ చేయడం ఈ రోజుల్లో మామూలు విషయం అయిపోయింది. మల్టీస్టారర్లు అంటే.. పాత్ర పరంగానే కాక అన్ని రకాలుగా సమాన ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలి, అభిమానులను దృష్టిలో ఉంచుకోవాలి. కానీ క్యామియోల విషయంలో ఈ సమస్య ఉండదు. సినిమాలో కొన్ని నిమిషాలు అలా మెరిసి మాయం అయిపోయే పాత్రలతో అవి పోషించే నటులకూ ఇబ్బంది ఉండదు. చూసేవారికి అదొక చిన్న హై ఇస్తే చాలు. అంతకుమించి ఏమీ ఆశించరు.
ఇలాంటి క్యారెక్టర్లతో షూట్ పరంగా కూడా సమస్య ఏమీ ఉండదు. రెండు మూడు రోజులు డేట్లిస్తే పనైపోతుంది. పారితోషకం కూడా అందుకు తగ్గట్లే వస్తుంది. అందుకే ఈ మధ్య క్యామియో రోల్స్ బాగా పెరుగుతున్నాయి. బాలీవుడ్లో ముందు నుంచి ఈ ఒరవడి ఉంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ అయిన షారుఖ్ సినిమా పఠాన్‌లో సల్మాన్ ఖాన్ క్యామియో ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. థియేటర్లో ప్రేక్షకులు ఈ పాత్ర తెరపైకి వచ్చినపుడు ఊగిపోయారు. సినిమాకు అది మేజర్ హైలైట్లలో ఒకటిగా నిలిచింది.
ఇందుకు ప్రతిగా సల్మాన్ సినిమా టైగర్3లో షారుఖ్ ఖాన్ క్యామియో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా షారుఖ్ తర్వాతి సినిమా జవాన్‌లోనూ ఇలాంటి ప్రత్యేక పాత్ర ఒకటి పెడుతున్నారట. తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఈ పాత్ర కోసం సౌత్ స్టార్‌నే తీసుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతానికి ఈ క్యారెక్టర్‌కు అల్లు అర్జున్ పేరు బలంగా వినిపిస్తోంది. పుష్ప సినిమాతో ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించాడు బన్నీ. దక్షిణాదిన ఆల్రెడీ అతడికి బలమైన మార్కెట్ ఉంది. ఇలాంటి హీరోతో క్యామియో చేయిస్తే పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. ఐతే పుష్ప2 షూటింగ్‌లో పుల్ బిజీగా ఉన్న బన్నీ వీలు చేసుకుని ఈ పాత్రకు డేట్లు కేటాయిస్తాడేమో చూడాలి.
This post was last modified on February 13, 2023 4:42 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…