అసలే గొడవ లేకుండా సంక్రాంతికి వచ్చేసి ఉంటే ఆది పురుష్ ఈపాటికి ఫైనల్ రన్ పూర్తి చేసుకుని ఓటిటి రిలీజ్ కు దగ్గరగా ఉండేది. ట్రయిలర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దెబ్బకు యూనిట్ మొత్తం రిపేర్లు చేసే పనిలో పడింది. అందుకే తప్పని పరిస్థితిలో కొత్త డేట్ గా జూన్ 16 చాలా రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది అనౌన్స్ అయ్యాకే ఇతర ప్యాన్ ఇండియాలు పోటీ ఎందుకు లెమ్మని దానికి అనుగుణంగా షెడ్యూల్ చేసుకుంటున్నాయి. అవతార్ తరహాలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఆది పురుష్ అదనంగా చేస్తున్న వర్క్ కోసం వంద కోట్లవుతోందట.
ఇదిలా ఉండగా జూన్ 16న ఒక్కళ్ళే వస్తున్నామని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడటానికి లేదు. ఎందుకంటే అదే రోజు హాలీవుడ్ మూవీ ది ఫ్లాష్ ని షెడ్యూల్ చేసి ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు. దీని వల్ల ఇండియాలో తీవ్ర ప్రభావం ఉండదు కానీ ఓవర్సీస్ లో ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఎందుకంటే యుఎస్ యుకె లాంటి దేశాల్లో ఫ్లాష్ సినిమాకున్న క్రేజ్, నిర్మాణ సంస్థకున్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దాన్ని భారీ ఎత్తున స్క్రీన్లను దక్కించుకునేలా చేస్తుంది. అదే జరిగితే ఆది పురుష్ ఓపెనింగ్స్ కి పెద్ద గండి పడుతుంది. టాక్ పాజిటివ్ గా వస్తే ఇబ్బంది లేదు కానీ లేదంటేనే చిక్కు.
ఇప్పుడీ కారణంగా మరో డేట్ కు వెళ్తారా లేక రిస్క్ చేసి ఏం పర్లేదనుకుంటారానేది వేచి చూడాలి. మరోవైపు ఇది ఎలాగూ పోస్ట్ పోన్ అవుతుందన్న నమ్మాకమో లేక తక్కువ గ్యాప్ ఉన్న పర్లేదు ఆడుతుందన్న ధైర్యమో కానీ సలార్ మాత్రం సెప్టెంబర్ 28కే పక్కాగా ఫిక్స్ అయిపోయింది. కంటెంట్ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ఏ కోణంలో చూసుకున్నా ది ఫ్లాష్ తో ఆది పురుష్ అంత సులభంగా పోటీ పడలేదు. మనది మహా అయితే ఓ అయిదు వందల కోట్లు ఉంటుంది. కానీ అవతల వాళ్ళది దీనికి పదింతలు ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి ఏం జరగనుందో
This post was last modified on February 13, 2023 4:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…