ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ లకు భారీ బడ్జెట్ సినిమాల రేంజ్ లో అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు రంగప్రవేశం చేశాక వీటి హైప్ వల్ల రాత్రి పూట ఎంత ఆలస్యమైనా సరే ఏకధాటిగా చూసే ఆడియన్స్ పెరిగిపోతున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ తో వెబ్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన దర్శక ద్వయం రాజ్ అండ్ డికెలు తాజాగా ఫర్జీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఏదో ప్యాన్ ఇండియా మూవీలాగా అమెజాన్ ప్రైమ్ దీనికి చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు. స్టార్ క్యాస్టింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ సెమీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందోనన్న ఆసక్తి కలగడం సహజం.
ఇది దొంగనోట్ల చుట్టూ తిరిగే కథ. అందరూ సన్నీ అని పిలుచుకునే సందీప్(షాహిద్ కపూర్)గొప్ప ఆర్టిస్టు. దేన్నైనా అచ్చుగుద్దినట్టు బొమ్మ వేయడం అతని ప్రత్యేకత. తాత నడిపే క్రాంతి పత్రిక వల్ల అప్పులు నెత్తిమీదకు రావడంతో ఫేక్ కరెన్సీని బొమ్మగా వేసి అదే ప్రెస్ లో ప్రింట్లు తీసి చెలామణి చేసి సక్సెస్ అవుతాడు. ఇదే దందా చేసే మన్సూర్(కెకె మీనన్)సన్నీని తనతో కలుపుకుంటాడు. ఈ స్కామ్ ని ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు మైఖేల్(విజయ్ సేతుపతి). దొంగ పోలీస్ ఆట మొదలవుతుంది. మధ్యలో మేఘ(రాశి ఖన్నా) చేసిందేంటి, ఎవరు గెలిచారు లాంటి ప్రశ్నలకు సమాధానం ఫర్జీ
ఒక్కోటి గంటకు దగ్గరగా మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఫర్జీ తీశారు. నకిలీ భాగోతాలు ఎలా జరుగుతాయి, ప్రభుత్వాలు పోలీసుల కళ్లుగప్పి మాఫియా వీటిని ఎలా మేనేజ్ చేస్తుందనేది రాజ్ అండ్ డికెలు బాగా చూపించారు. విపరీతమైన అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఫర్జీ ఓకే వాచ్.
మొదట్లో కనిపించే సాగతీతను మినహాయిస్తే మిగిలినదంతా మంచి టెంపోతో నడిపించారు. ద్వందార్థాలు కొంత ఇబ్బంది పెట్టేలా ఉన్నా పాత్రల మధ్య వన్ లైనర్స్ బాగా పేలాయి. సెకండ్ సీజన్ బజ్ కోసం క్లైమాక్స్ ని అసంపూర్ణంగా వదిలేయడం కొంత ఇబ్బంది. ఫైనల్ గా చెప్పాలంటే ఫర్జీ ఖర్చుపెట్టిన సమయానికి ఓ మోస్తరు న్యాయమైతే చేసింది.
This post was last modified on February 13, 2023 9:28 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…