ఈ మధ్య ఉన్నట్లుండి కోలీవుడ్ హీరోల దృష్టి టాలీవుడ్ దర్శకుల మీద పడింది. తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడం దశాబ్దాల నుంచి చూస్తున్నాం కానీ.. మన డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి కోలీవుడ్ స్టార్లు ఆసక్తిని ప్రదర్శించడం మాత్రం అరుదు.
ఆల్రెడీ కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్.. మన వంశీ పైడిపల్లితో ‘వారిసు’ సినిమా చేశాడు. ఈ సినిమా రకరకాల కారణాల వల్ల విడుదలకు ముందు విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కొంది. రిలీజ్ తర్వాత టాక్ కూడా ఏమంత బాగా లేదు.
కానీ ఈ నెగెటివిటీని తట్టుకుని సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది. విజయ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తానికి సినిమా అంతిమంగా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. రిలీజ్‌కు ముందు, రిలీజ్ తర్వాత వంశీ పైడిపల్లి బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పటికీ.. చివరికి ఒక సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన దర్శకుడిగా అతడికి పేరొచ్చింది.
కట్ చేస్తే ఇప్పుడు ఇంకో టాలీవుడ్ దర్శకుడు కోలీవుడ్ బాక్సాఫీస్‌లో పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. అతనే.. వెంకీ అట్లూరి. ఈ యువ దర్శకుడితో కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ ‘సార్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ మిగతా స్టార్ల మాదిరి రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసే టైపు కాదు. అతడి సినిమాల్లో వైవిధ్యం ఉంటుంది. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తుంటాడు.
ఇలాంటి హీరోతో హిట్ కొట్టడం అంత తేలిక కాదు. ధనుష్ లాంటి నటుడు వెంకీని నమ్మి సినిమా చేశాడంటే అది విశేషమే. ఇటీవలే రిలీజైన ‘సార్’ ట్రైలర్లో ఎంటర్టైన్మెంట్‌తో పాటు మంచి మెసేజ్ కూడా కనిపించింది. కానీ ఇలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించడం అంత తేలిక కాదు.
సినిమాకు ఇటు తెలుగులో, అటు తమిళం మరీ బజ్ ఏమీ లేదు. రిలీజ్ ఆలస్యం కావడం, సరిగ్గా సినిమాను ప్రమోట్ చేయకపోవడం కొంత మైనస్ అయింది. ఐతే రిలీజ్ టైంకి ఆటోమేటిగ్గా హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 17న మహాశివరాత్రి కానుకగా విడుదల కానున్న ‘సార్’ రెండు భాషల్లో మంచి విజయం సాధించిన ధనుష్ నమ్మకాన్ని నిలబెడుతుందేమో చూడాలి.
This post was last modified on February 13, 2023 9:33 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…