సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ఫ్యాన్ వార్స్ ఎంత శ్రుతి మించిపోయాయో తెలిసిందే. చిన్న చిన్న కారణాలు పట్టుకుని స్టార్ హీరోల అభిమానులు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం.. హీరోలను కించపరచడం చేస్తున్నారు.
ఇంతకుముందు రెండు వేర్వేరు ఫ్యామిలీ హీరోల అభిమానుల మధ్యే గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పరస్పరం దారుణాతి దారుణమైన మాటలు అనుకుంటున్నారు. నెగెటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు.
ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు ఇంకా హీరోలు కాని తర్వాతి తరం కుర్రాళ్ల విషయంలోనూ ఫ్యాన్ వార్స్ జరుగుతుండడం విడ్డూరం. మామూలుగానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య తరచుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు వారి కొడుకుల విషయంలోనూ గొడవలు మొదలయ్యాయి.
మహేష్ బాబు కొడుకు గౌతమ్.. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ప్రస్తుతం టీనేజీలో ఉన్నారు. వీళ్ల దృష్టి ప్రస్తుతానికి చదువు మీదే ఉంది. మీడియాకు దూరంగా వాళ్లను పెంచుతున్నారు. ఎప్పుడో అనుకోకుండా బయటికి వచ్చినపుడు ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి.
కాగా.. మొన్న హైదరాబాద్ ఫార్ములా-ఈ రేసింగ్ ప్రాక్టీస్ చూడడం కోసం గౌతమ్ బయటికి వచ్చాడు. ఒక్కసారిగా మీడియా అతడి మీద పడిపోయింది. మహా సిగ్గరి అయిన గౌతమ్‌ను మీడియా వాళ్లు రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. మరోవైపు అకీరా ఎక్కడికి, ఎందుకు వచ్చాడో తెలియదు కానీ.. తన ఫొటో అయితే సోషల్ మీడియాలోకి చేరిపోయింది.
ఇక అంతే.. ఇటు పవన్ ఫ్యాన్సేమో అకీరా ఏమున్నాడో చూశారా, డెబ్యూ హీరో రికార్డులన్నీ బద్దలైపోతాయి అంటూ ఎలివేషన్ ఇవ్వడం మొదలుపెడితే.. అవతల మహేష్ ఫ్యాన్స్ గౌతమ్ భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడు అవుతాడని, రికార్డుల మోత మోగించేస్తాడని కొనియాడడం మొదలుపెట్టారు. అంతటితో ఆగితే సరే.. ఈ ఫ్యాన్స్ ఆ ఇద్దరు కుర్రాళ్లతో పాటు వారి తండ్రులను కించపరచడం మొదలుపెట్టారు.
ఇక్కడ కూడా రికార్డులు.. వారి ఆహార్యాల గురించిన ప్రస్తావన వచ్చి.. దారుణమైన మాటలతో దిగజారి ప్రవర్తిస్తున్నారు. అసలు ఎప్పుడు సినిమాల్లోకి వస్తారో.. అసలు వస్తారో రారో తెలియని కుర్రాళ్ల గురించి ఇప్పుడే గొడవలు పడడం ఫ్యాన్ వార్స్‌లో నెక్స్ట్ లెవెల్ అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on February 13, 2023 8:24 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…