మొన్న సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కాకపోయి ఉంటే ఎలా ఉండేదేమో కానీ ఇప్పుడా ఘనవిజయమే చిరంజీవిని బోలెడు అయోమయంలోకి నెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న భోళా శంకర్ లోనే కొన్ని కీలక మార్పులు చేశారట. అభిమానులు తననుంచి కోరుకుంటున్న కామెడీ, యాక్షన్, డాన్స్ ని తగిన మోతాదులో పెంచేలా దర్శకుడు మెహర్ రమేష్ బృందంతో కలిసి చాలా చర్చలు జరిగాయని వినికిడి. అవన్నీ ఓకే అయ్యాకే ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్ళింది. ఇదంతా కీర్తి సురేష్ డేట్లకు అనుగుణంగా తను వచ్చేలోగానే ఆఘమేఘాల మీద చేశారట.
ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ లో వచ్చే కోల్కతా బ్యాక్ డ్రాప్ ఇంట్రో సాంగ్ ని షూట్ చేస్తున్నారు. వేసవిలో కుదరకపోతే దసరా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీని సంగతలా ఉంచితే తర్వాత ఎవరితో చేయాలనే దాని మీద మెగాస్టార్ ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోతున్నారట. భీష్మ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల స్టోరీ లైన్ నచ్చిన తర్వాత ఫైనల్ వెర్షన్ మీద ఏకాభిప్రాయం రాక అది క్యాన్సిల్ అయ్యింది. అఫీషియల్ గా చెప్పలేదు కానీ వెంకీ ఆల్రెడీ నితిన్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడని టాక్ ఉంది. పూరి జగన్నాధ్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే న్యూస్ ఉంది కానీ ప్రస్తుతానికి అది గాలి వార్తే.
ఫామ్ లో డైరెక్టర్లందరూ బిజీగా ఉన్నారు. కనీసం ఏడాదికి పైగా ఎవరూ ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. వివి వినాయక్ తోనే చేయొచ్చనే మాట వినిపిస్తోంది కానీ అది కార్యరూపం దాల్చే దాకా చెప్పలేం. అజిత్ విశ్వాసంని తీస్తారనే న్యూస్ వట్టి పుకారు. బ్రో డాడీ ఆలోచన కూడా డ్రాప్ అయ్యారు. రామ్ చరణ్ దగ్గర హక్కులున్న డ్రైవింగ్ లైసెన్స్ ని చిరు మీద ట్రై చేయొచ్చు కానీ త్వరలో రిలీజ్ కానున్న అక్షయ్ కుమార్ హిందీ వెర్షన్ సెల్ఫీ ఫలితం చూశాక డిసైడ్ అవ్వొచ్చు. మొత్తానికి ఇప్పటికిప్పుడు ఆప్షన్లైతే పెద్దగా లేవు కాబట్టి భోళా శంకర్ తర్వాత గ్యాప్ వచ్చేలా ఉంది
This post was last modified on February 12, 2023 11:38 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…