మెగా, నందమూరి ఫ్యామిలీ అభిమానుల మధ్య గ్రౌండ్ లెవెల్లో ఉండే వైరం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల నుంచి చిరు, బాలయ్య అభిమానుల మధ్య వైరం నడుస్తోంది. తర్వాతి తరం హీారోల ఫ్యాన్స్ మధ్య కూడా గొడవలు కామనే. ఐతే బయట ఫ్యాన్స్ ఇలా ఊరికే చొక్కాలు చించేసుకుంటారు కానీ.. రెండు కుటుంబాల హీరోలు మాత్రం చాలా వరకు సన్నిహితంగానే కనిపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఒకరి గురించి ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడం, మాట తూలడం లాంటివి జరిగి ఉండొచ్చు కానీ.. అంతకుమించి పెద్ద శత్రుత్వం ఉన్నట్లయితే కనిపించదు.
తాజాగా బాలయ్య నిర్వహించే అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ పూర్తిగా చూస్తే ఇరు కుటుంబాల అభిమానుల ఆలోచనల్లో చాలానే మార్పు రావచ్చు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ పార్ట్-2 చివర్లో పవన్ చెప్పిన కొన్ని మాటలు ఇరు వర్గాల అభిమానుల మీద గట్టి ప్రభావం చూపేవే.
ఎపిసోడ్ చివర్లో తన గురించి అభిప్రాయం చెప్పమని బాలయ్య.. పవన్‌ను అడిగాడు. ఈ షోకు రాకముందు, వచ్చాక అభిప్రాయాల్లో తేడా ఉంటే చెప్పాలని కూడా అడిగాడు. దీనికి పవన్ బదులిస్తూ.. అందరూ బాలయ్య గురించి చెప్పే మాటలే చెప్పాడు. మనసులో ఏదీ దాచుకోరని, ఏమనిపిస్తే అది మాట్లాడేస్తారని.. కల్మషం కనిపించదని అన్నాడు. అలాగే మెగా కుటుంబం.. బాలయ్య గురించి ఏమనుకుంటుందో కూడా పవన్ వెల్లడించాడు.
ఒక టైంలో బాలయ్య వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడని.. ఆయన కెరీర్ ఇబ్బందికరంగా మారిందని.. ఆ టైంలో ఆయనకు ఒక హిట్ వస్తే బాగుంటుందని తమ కుటుంబంలో అందరం కలిసి కోరుకున్నామని పవన్ వెల్లడించాడు. ముఖ్యంగా నాగబాబు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించి.జ. బాలయ్యకు హిట్టు రావాలని అని అందరి ముందు అన్నట్లు పవన్ తెలిపాడు. సినిమాల పరంగా తమ మధ్య పోటీ ఉండొచ్చు, రాజకీయంగా వేర్వేరు అభిప్రాయాలతో సాగొచ్చు కానీ.. ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరూ బాగుండాలని, విజయాలు అందుకోవాలనే తాము కోరుకుంటామని.. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవని పవన్ తెలిపాడు.
This post was last modified on February 12, 2023 11:24 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…