మెగాస్టార్ చిరంజీవి తరపున వారసుడిగా రామ్ చరణ్ స్టార్ హీరోగా సెటిలైపోయాడు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ చక్కగా కుదురుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ ఆ లెగసిని తీసుకెళ్లే హీరోగా అభిమానులు అకీరానందన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అతని తల్లి రేణు దేశాయ్ తో ఎప్పుడో విడాకులు జరిగినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం అకీరా ఎలాగూ పవర్ స్టార్ బ్లడ్డే కాబట్టి తన లాంచ్ కోసం ఎదురుచూపులు మొదలెట్టారు. ఈ విషయంలో ఆవిడ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని తరచుగా ఇచ్చే ఇంటర్వ్యూలలో గమనించవచ్చు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.
దానికి తగ్గట్టే అకీరా ఈ మధ్య ఎక్కువగా హైదరాబాద్ లో కనిపిస్తున్నాడు. గత నెల ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో వాల్తేరు వీరయ్య ప్రీమియర్ షోకు మాస్క్ వేసుకుని వచ్చినా ఫొటోల్లో దొరికిపోయాడు. తాజాగా తన పూర్తి లుక్ బయట పెట్టే పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కుర్రాడు దిట్టంగా ఉండటంతో డెబ్యూ చేయించమని, అన్నయ్య చరణ్ చిరుత రికార్డులు డెబ్యూతో అకీరానే బద్దలు కొట్టాలని రకరకాలుగా ట్వీట్లు వేస్తున్నారు. ఆ ఫోటోలు కాస్తా వైరల్ కావడంతో ఇంకో రెండు మూడేళ్ళలో తెరగేంట్రం జరిగినా ఆశ్చర్యం లేదంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు.
పవన్ ఎలాగూ జనసేనతో బిజీ అవుతున్నారు. ఎన్నికలు ఇంకో ఏడాదికి అటుఇటు వచ్చేస్తాయి. ఒకవేళ అప్పుడు భవిషత్తు కనక ఆశాజనకంగా ఉంటే సినిమాలు మానేయాల్సి వస్తుంది. అప్పుడు అకీరాకు స్పేస్ దొరుకుతుంది. తండ్రి రిటైర్ అయ్యాకే కొడుకు రావాలని లేదు కాబట్టి ఒకవేళ పవన్ మేనియా కొనసాగుతున్న టైంలోనే దించినా ఖచ్చితంగా ఓపెనింగ్స్ భీభత్సంగా ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఈ అంచనాలు ఎప్పుడు నిజమవుతాయో చెప్పలేం కానీ ఇంతకీ అకీరా స్క్రీన్ మీదకు వచ్చేందుకు సరిపడా యాక్టింగ్, ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడో లేదో.
This post was last modified on February 12, 2023 3:16 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…