ఒకప్పుడు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుండి సినిమా వస్తుందంటే చాలు సూపర్ హిట్ ఆన్ ది వే అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు లెక్క మారింది. దిల్ రాజు గారు తన డిసిషన్స్ తో బ్రాండ్ ను దెబ్బతీసుకుంటున్నారు. ఎస్వీసీ నుండి వరుసగా వచ్చిన సినిమాలన్నీ అపజయాలు అందుకున్నాయి. వకీల్ సాబ్ , ఎఫ్ 3 యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాయి తప్ప బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ తో సౌండ్ చేయలేకపోయాయి.
తాజాగా దిల్ రాజు బేనర్ కి ‘థాంక్యూ’ రూపంలో ఓ డిజాస్టర్ దక్కింది. అయితే ఇప్పుడు దిల్ రాజు ఓ చిన్న సినిమాతో మళ్ళీ అందరి మన్ననలు అందుకోవాలని భావిస్తున్నాడు. ఓ కామెడీ కం ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే బలగం. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణా నేపథ్య కథతో ఓ విలేజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. మంచి టైమ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు మార్చ్ లో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే దిల్ రాజు కాంపౌండ్ ఈ సినిమా మరో శతమానం భవతి అంటూ చెప్పుకుంటున్నారు. అవార్డులు కూడా పక్కా అంటున్నారు. మరి బలగం దిల్ రాజు ఈజ్ బ్యాక్ అని చెప్పుకునేలా చేస్తుందా ? చూడాలి.
This post was last modified on February 12, 2023 10:39 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…