థియేటర్ల సమస్య లేదు. పోటీ కూడా పెద్దగా లేదు. ఏ సినిమా రిలీజైనా కావాల్సినన్ని స్క్రీన్లు, షోలు రిలీజవుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే చూడడానికి ప్రేక్షకులు కూడా సిద్ధంగానే ఉన్నారు. కానీ ఈ అనుకూల పరిస్థితులను ఉపయోగించుకునే సినిమానే కనిపించడం లేదు. సంక్రాంతి సినిమాల తర్వాత పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి, మంచి వసూళ్లు రాబట్టిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటీ లేవు.
ఒక్క ‘రైటర్ పద్మభూషణ్’ మాత్రమే ప్రేక్షకులను ఓ మోస్తరుగా మెప్పించి దాని స్థాయిలో మంచి కలెక్షన్లు తెచ్చుకుంది. కానీ ఎంతైనా అది చిన్న సినిమా కావడంతో థియేటర్లు మరీ కళకళలాడిపోలేదు. తొలి వీకెండ్ తర్వాత ఆ సినిమా వసూళ్లు కూడా పడిపోయాయి. ఇక జనవరి చివరి వారంలో వచ్చిన హంట్ మూవీ అయితే వాషౌట్ అయిపోయింది. ఫిబ్రవరి 3న ‘రైటర్ పద్మభూషణ్’తో పాటుగా రిలీజైన మైకేల్, బుట్టబొమ్మ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. సందీప్ కిషన్ సినిమాకు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. ఇంకో సినిమానైతే ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇక ఈ వారం అయినా థియేటర్లలో సందడి కనిపిస్తుందనుకుంటే.. మంచి అంచనాలతో వచ్చిన ‘అమిగోస్’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ‘బింబిసార’తో పోలిస్తే ఈ సినిమా ఓపెనింగ్స్ సగానికి సగం కూడా లేవట. కళ్యాణ్ రామ్ నుంచి ప్రేక్షకులు మాస్ సినిమాలే తప్ప ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న థ్రిల్లర్లు కోరుకోవడం లేదని స్పష్టమైంది. ఈ సినిమాకు టాక్ కూడా డివైడ్‌గానే ఉండడంతో వీకెండ్ తర్వాత నిలబడ్డం కష్టమే అన్నట్లుంది. దీంతో పాటుగా ‘పాప్ కార్న్’ అనే చిన్న సినిమా రిలీజైంది కానీ.. ఆ సంగతి కూడా చాలామందికి తెలియదు.
ఇక బజ్ లేకుండా రిలీజైన బాబీ సింహా డబ్బింగ్ మూవీ ‘వసంత కోకిల’ పరిస్థితీ అంతంతమాత్రమే. తమిళంలోనే పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్న ఈ చిత్రానికి తెలుగు నుంచి ఇంకేం ఆశించగలరు? ఎంత అన్ సీజన్ అయినప్పటికీ బాక్సాఫీస్ ఇంత డల్లయిపోవడం ఆశ్చర్యకరమే. వచ్చేవారం ‘సార్’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో అయినా పరిస్థితి మారుతుందేమో చూడాలి.
This post was last modified on February 11, 2023 7:39 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…