హిట్టు ఫ్లాపు పక్కనపెడితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మాస్ లో మంచి ఫాలోయింగే ఉంది. ఎంత రొటీన్ కథలు తీసినా ఏదో ఒకదానితో పెద్ద సక్సెస్ కొట్టకపోతాడాని నిర్మాతలు ముందుకు వస్తూనే ఉంటారు. తమిళ రట్ససన్ రీమేక్ రాక్షసుడు మంచి విజయం సాధించాక అల్లుడు అదుర్స్ దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ యూత్ హీరో కనిపించనే లేదు. బాలీవుడ్ ఎంట్రీ కోసమని ఛత్రపతి రీమేక్ కి సంతకం చేశాక పూర్తి ఫోకస్ దాని మీద పెట్టేసి ఏకంగా ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. వివి వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో దాన్ని రూపొందించింది.
షూటింగ్ అయిపోయినట్టుగాని జరుగుతున్నట్టుగాని ఎలాంటి అప్డేట్స్ నిర్మాణ సంస్థ నుంచి రావడం లేదు. నార్త్ మీడియా టాక్ ప్రకారం ఛత్రపతిని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసే దిశగా ప్రొడ్యూసర్లు ఆలోచిస్తున్నారట. థియేట్రికల్ బిజినెస్ అంత ఆశాజనకంగా జరిగే సూచనలు లేకపోవడం, పెట్టిన ఖర్చుకి వచ్చే రాబడికి మధ్య వ్యత్యాసం ఉండేలా కనిపించడంతో ఫైనల్ గా డిజిటల్ కే మొగ్గు చూపొచ్చని అంటున్నారు. ఈ కారణంగా దీనికి సంబంధించిన ఏ న్యూస్ ని మీడియాతో షేర్ చేసుకోలేదట. డీల్ ఫైనల్ అయ్యాక అప్పుడు పూర్తి వివరాలు బయట పెట్టబోతున్నారు.
యూట్యూబ్ లో మన ఫ్లాప్ సినిమాలు వచ్చినంత మాత్రాన మనకేదో స్టార్ డం వచ్చినట్టు కాదు. ఆ మాటకొస్తే బెల్లం హీరోవే కాదు నితిన్, రామ్ లాంటి హీరోల అల్ట్రా డిజాస్టర్లు సైతం హిందీ డబ్బింగ్ లో వందల మిలియన్ల వ్యూస్ ని పోగేశాయి. ఇక్కడే సాయిశ్రీనివాస్ అంచనా ఇంకోలా వెళ్ళిపోయి ఛత్రపతి హిందీ రీమేక్ కు టెంప్ట్ చేశాయి. దీనికి గాను అక్షరాలా మూడేళ్ళ విలువైన కాలం కర్పూరమయ్యింది. ఒకవేళ అది ఓటిటిలో ఆడినా ఆడకపోయినా వచ్చేదేమి లేదు. ఇమేజ్ ని థియేటర్ రెవిన్యూలో కొలిచే ఇండస్ట్రీలో వెండితెరపైకొస్తేనే అసలు సత్తా తెలుస్తుంది. ఈ లెక్కన బెల్లం హీరో కష్టమంతా వృథా అయినట్టే.
This post was last modified on February 11, 2023 3:49 pm
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…