బాలీవుడ్లో ప్రస్తుతం ఉత్తమ నటుల్లో ఒకడు నవాజుద్దీన్ సిద్ధిఖి. ఆయన ప్రతిభ ఎలాంటిదో చెప్పడానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్-2’ ఒక్క సినిమా చాలు. ఇందులో లీడ్ రోల్‌ను నవాజ్ పోషించినట్లు ఇంకెవరూ చేయలేరు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు నవాజ్. ఐతే ఈ గొప్ప నటుడు కొంత కాలంగా వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు.
భార్య ఆలియాతో అతడికి తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. వీరి విడాకుల కేసు కోర్టులో నలుగుతోంది. నవాజ్, అతడి తల్లి ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఆలియా వారి ఇంట్లోనే ఉంటోంది. దీంతో నవాజ్ వెళ్లి హోటల్లో ఉంటున్నాడు. ఈ గొడవ ఇలా సాగుతుండగా.. నవాజ్ మీద ఆలియా తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టి నవాజ్‌తో తన పరిచయం జరిగిన దగ్గర్నుంచి ఏం జరిగిందో ఆమె వివరించింది. వైరల్ అవుతున్న ఈ పోస్టులో ఆమె ఏమందంటే..
“2004లో మేం మొదటిసారి కలిశాం. అప్పట్లో నేను, నవాజ్, అతడి సోదరుడు ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. కొంత కాలానికే మేమిద్దరం దగ్గరయ్యాం. ఆ సమయంలో మేం ఎంతో సంతోషంగా ఉన్నాం. అప్పటికి నవాజ్‌కు ఎలాంటి సంపాదన లేదు. నేను, అతడి సోదరుడు కలిసి తన ఖర్చులన్నీ చూసుకునేవాళ్లం. 2010లో నేను, నవాజ్ పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఏడాదికి నేనో పాపకు జన్మనిచ్చాను. డెలివరీ ఖర్చులతో పాటు నవాజ్ కారు కోసమని మా అమ్మ నాకిచ్చిన ఫ్లాట్ కూడా అమ్మేశాను. ఇంత చేసిన నాకు నవాజ్ అన్యాయం చేశాడు. అతను పూర్తిగా మారిపోయాడు. నేనంటే విలువ లేని వ్యక్తికి నా జీవితంలో 18 ఏళ్లు కేటాయించినందుకు చింతిస్తున్నా. అతను మానవత్వాన్ని మరిచిపోయాడు. నిజం చెప్పాలంటే నవాజ్ అంత మంచివాడేమీ కాదు. పిల్లల్ని కూడా సరిగా చూసుకోలేదు. ఇంత కాలం తర్వాత నాపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. మా మొదటి సంతానం తర్వాత నాకు విడాకులు ఇచ్చేసినట్లు అందరికీ చెబుతున్నాడు. ఇది అబద్ధం. ఈ ఆరోపణలు నన్నెంతో బాధ పెడుతున్నాయి”.
This post was last modified on February 11, 2023 2:29 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…