Movie News

జక్కన్నను మెచ్చుకున్న జురాసిక్ సృష్టికర్త

ఆస్కార్ వేడుక కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేస్తోంది. మార్చిలో గ్రాండ్ గా జరగబోయే అకాడమీ ఈవెంట్ కోసం ఆర్ఆర్ఆర్ బృందమే కాదు సగటు సినీ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ పడుతున్న సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు ఊపందుకున్నాయి. వాటిలో హాలీవుడ్ దిగ్గజం స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించిన ది ఫాబెల్ మ్యాన్స్ ఉంది. దీని కోసం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా ఈయన మన రాజమౌళితో వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ములాఖత్ అయ్యారు. అవతలి వ్యక్తికో స్థాయి ఉంటే ఉంటే తప్ప స్పీల్బర్డ్ లాంటివాళ్లు ఒప్పుకోరు.

ఈ సందర్భంగా అంతటి దిగ్గజం మన జక్కన్నను ప్రశంసలతో ముంచెత్తారు. పోయిన వారం ఆర్ఆర్ఆర్ చూశానని అద్భుతంగా ఉందని, నా కళ్ళతో చూసినా నమ్మశక్యంగా కానంత గొప్పగా తీశావని, రామ్, రామా, అలియాలతో పాటు తన లాస్ట్ క్రూసేడ్ లో నటించిన అలిసన్ కూడా అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. అంతే కాదు ఆస్కార్ లాంటి పురస్కారాలు గెలవాలంటే ఒరిజినాలిటీకి కట్టుబడి ఉండాలని, లక్ష్యంగా పెట్టుకున్న ఆడియన్స్ ని మెప్పించడమే ధ్యేయంగా స్క్రిప్ట్ రాసుకోవాలి పలు సూచలను ఇచ్చారు. ఫాబెల్ మ్యాన్స్ మేకింగ్ లోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పారు.

ఇంత ఇంటరాక్షన్ జరిగితే రాజమౌళి ఆనందం వర్ణించేలా ఉంటుందా. లేచి డాన్సు చేయాలని ఉందని చెప్పి ఒక రైటర్ గా స్పీల్బర్గ్ ఆలోచన శైలి ఎలా ఉంటుందనే దాని మీద పలు టిప్స్ తీసుకున్నారు. ఇప్పుడీ ఇంటర్వ్యూ వీడియో మంచి ట్రెండింగ్ లో ఉంది. గతంలో ఎప్పుడూ ఒక ఇండియన్ ఫిలిం మేకర్ తో స్పీల్బర్గ్ లాంటి మహామహులు ఇంత ఓపెన్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది గొప్ప ఘనత. అవతార్ ని సృష్టించిన క్యామరూన్ లాంటి వాళ్ళు సైతం ఆర్ఆర్ఆర్ ని ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. చూస్తుంటే ఆస్కార్ కు రాజమౌళి కొన్ని అడుగుల దూరంలో ఉన్నట్టే.

This post was last modified on February 11, 2023 2:04 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago