శాకుంతలం భలే డేట్ పడుతోంది

అన్నీ ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే శాకుంతలం వచ్చే వారం 17న రిలీజైపోయేది. సమంతా ముంబైలో సిటాడెల్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో పాటు పలు సాంకేతిక కారణాల వల్ల దర్శకుడు కం నిర్మాణ భాగస్వామి గుణశేఖర్ కు వాయిదా వేయక తప్పింది కాదు. లేదంటే దిల్ రాజు ప్రకటించిన డేట్ ప్రకారం వచ్చేసేది. తాజాగా దీని కొత్త డేట్ ని ఏప్రిల్ 13గా లాక్ చేసుకున్నట్టు సమాచారం. ఆ టైంలో రావాల్సిన చిరంజీవి భోళా శంకర్, రజినీకాంత్ జైలర్ రెండూ వాయిదా పడటంతో ఇదే మంచి అవకాశమని ఫిక్స్ చేశారట. అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో రానుంది.

ఇంకా అరవై రోజులకు పైగా సమయం ఉంది కాబట్టి ప్రమోషన్లను నిక్షేపంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈలోగా సామ్ తిరిగి వచ్చేస్తుంది. విజయ్ దేవరకొండ ఖుషి బ్యాలన్స్ షూటింగ్ లో పాల్గొనడంతో పాటు శాకుంతలంకు సరిపడా సమయాన్ని కేటాయించొచ్చు. త్రీడి టెక్నాలజీలో రూపొందిన ఈ పీరియడ్ డ్రామాను అన్ని ప్రధాన భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది కానీ బాహుబలి, రుద్రమదేవి రేంజ్ లో అంచనాలు పెంచడానికి సరిపోయేలా మరో కొత్త వెర్షన్ ని సిద్ధం చేయిస్తున్నట్టు తెలిసింది. ఇంకా టైం ఉంది కాబట్టి వచ్చే నెల ప్లాన్ చేస్తారు

ఒక్కొక్కటిగా వదులుతున్న మణిశర్మ పాటలు మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. నిజానికి మార్చి 17 ఆలోచన చేశారు కానీ అది కూడా అంతగా సానుకూలమైన డేట్ కాకపోవడంతో ఫైనల్ గా ఏప్రిల్ కే వెళ్లే సంకేతాలు బలంగా ఉన్నాయి. యశోద సక్సెస్ తర్వాత సామ్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఇది. కేవలం తన బ్రాండ్ మీదే బిజినెస్ జరుగుతోంది. ఆడినా ఆడకపోయినా గుణశేఖర్ తో సమానంగా ఆ క్రెడిట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకే అన్ని విధాలా ఆలోచించి డిసైడ్ అయ్యారు. అఫీషియల్ అయ్యేదాకా ఏ మార్పులైనా జరగొచ్చు