థియేటర్లలో కొత్త సినిమాలు ఏం వస్తాయోనని ఎదురుచూసే మూవీ లవర్స్ ఉన్నట్టే ఇంట్లోనే కూర్చుని వినోదాన్ని ఆస్వాదించేందుకు ఓటిటి ఫ్యాన్స్ కూడా ఇదే తరహాలో వెయిట్ చేస్తుంటారు. ముఖ్యంగా డిజిటల్ విప్లవం వచ్చాక మరీ తీవ్రంగా కాదు కానీ రెగ్యులర్ బిజినెస్ మీద దీని ప్రభావం పడిన మాట వాస్తవం. ఓటిటిలు కూడా శుక్రవారం రిలీజులకే పెద్ద పీఠ వేయడంతో బోలెడు కంటెంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రేపు పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డికెలు రూపొందించిన ‘ఫర్జి’ వెబ్ సిరీస్ రాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది.
షాహిద్ కపూర్ విజయ్ సేతుపతి రాశి ఖన్నా క్రేజీ కాంబోలో అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో ఫర్జిని రూపొందించింది. గత నెల చివరి వారంలో వచ్చినట్టే తెలియకుండా మాయమైపోయిన సుధీర్ బాబు ‘హంట్’ ఆహాలో వస్తోంది. రాజకీయ అంశాలను ఎక్కువగా చర్చించిన బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ల ‘అన్ స్టాపబుల్’ చివరి ఎపిసోడ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ తెలుగులో రిలీజైన శివరాజ్ కుమార్ ‘వేద’ జీ5లో రేపే వచ్చేస్తోంది.సీనియర్ నటి రేవతి దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘సలాం వెంకీ’ని ఇదే ప్లాట్ ఫార్మ్ మీద చూసుకోవచ్చు. ఈ మూవీని అగ్రహీరోలు ప్రమోట్ చేశారు
హన్సిక నిజ జీవిత పెళ్లి తతంగం మొత్తం ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సింగర్ స్మిత కొత్త టాక్ షో ‘నిజం విత్ స్మిత’ సోనీ లివ్ లో వస్తుంది. మొదటి గెస్టే చిరంజీవి కావడంతో మెల్లగా హైప్ మొదలైంది. అజిత్ ‘తెగింపు’ కొంత అడ్వాన్స్ గా నిన్నటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. ఇన్నేసి ఉండటం వల్లే కళ్యాణం కమనీయం, మాలికాపురంలు వచ్చే వారానికి షిఫ్ట్ అయ్యాయి. ఆప్షన్లు ఎక్కువ కావడంతో ఆడియన్స్ సైతం ఏది చూడాలో ఏది చూడకూడదో డిసైడ్ అవ్వడానికి రివ్యూలు లేదా చూసిన వాళ్ళ టాక్ మీద ఆధారపడటం తప్ప వేరే మార్గం ఉండటం లేదు
This post was last modified on February 9, 2023 4:19 pm
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…