‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది మలయాళ భామ సంయుక్త మీనన్. ఆమె ఇంటిపేరు చూస్తేనే తను మలయాళీ అనే విషయం అర్థమైపోతుంది. అక్కడ బాగా పాపులర్ అయిన ఇంటిపేర్లలో ‘మీనన్’ ఒకటి. చాలామంది మలయాళీ ఆర్టిస్టుల ఇంటి పేర్లలో ‘మీనన్’ గమనించవచ్చు. ఐతే ఇక నుంచి సంయుక్త పేరులో మాత్రం ‘మీనన్’ ఉండబోదట.
తనను ఇక నుంచి ‘సంయుక్త’ అనే పిలవాలని.. ఆ ఇంటి పేరుతో తనకు సంబంధం లేదని ఆమె తేల్చేసింది. ‘మీనన్’ అనేది సంయుక్త తండ్రి ఇంటి పేరట. ఐతే ఆయన తన తల్లి నుంచి ఎన్నో ఏళ్ల కిందటే విడాకులు తీసుకున్నారని.. చిన్నపుడు స్కూల్లో తన పేరు వెనుక ‘మీనన్’ చేర్చారు కాబట్టి చాలా ఏళ్లు అలాగే కొనసాగించానని.. కానీ ఇకపై ఆ ఇంటిపేరును తీసేయాలని డిసైడయ్యానని.. ఇదంతా తన తల్లి కోసమే చేస్తున్నానని సంయుక్త వెల్లడించింది.
‘‘నా పేరు వెనుక ‘మీనన్’ను కొనసాగించకూడదనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. స్కూల్లో చేరినపుడు మన ఇంటి పేరుతో సహా పేరు రాస్తుంటారు. అలాగే నా పేరు వెనుక కూడా ‘మీనన్’ వచ్చి చేరింది. చిన్నతనంలో దాని గురించి ఆలోచించలేదు. కానీ నాకంటూ ఒక ఆలోచన వచ్చాక అది ఇబ్బందిగా అనిపించింది. ఒక వ్యక్తి పేరు వెనుక ఇలాంటి తోకలు ఎందుకు ఉండాలి అనే ఆలోచన వచ్చింది. పైగా నా తల్లిదండ్రులు ఎన్నో ఏళ్ల కిందటే విడాకులు తీసుకున్నారు. మా నాన్న ఇంటి పేరును కొనసాగించడం అమ్మకు ఇష్టం లేదు. ఆమె భావాల్ని గౌరవిస్తూ నా పేరు వెనుక ‘మీనన్’ తీసేయాలని నిర్ణయించుకున్నాను. ఇకపై నా సోషల్ మీడియా ఖాతాలో, నా సినిమాల్లో నా పేరు ‘సంయుక్త’గానే ఉంటుంది. అందరూ అలాగే పిలవండి’’ అని సంయుక్త వెల్లడించింది.
తాను చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానని.. ఎంతో ఏడ్చానని.. అందుకే తన సినిమాల్లో ఎమోషనల్ సీన్లు చేయడం పెద్దగా ఇబ్బంది అనిపించదని సంయుక్త పేర్కొనడం గమనార్హం.
This post was last modified on February 9, 2023 3:10 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…