గత ఏడాది బింబిసారతో భారీ విజయాన్ని అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. అది అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇంకో ఆరు నెలలకే ఇప్పుడు అమిగోస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నందమూరి హీరో. బింబిసారకు పూర్తి భిన్నంగా ఒక మోడర్న్ కథతో తెరకెక్కిన చిత్రమిది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం. అందులో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్ కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. టాలీవుడ్లో త్రిపాత్రాభినయం చేసిన అతి కొద్దిమంది హీరోల్లో ఒకడు కళ్యాణ్ రామ్.
ఈ సినిమా కథ మొత్తం ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతుందని.. స్క్రీన్ మొత్తం తనే కనిపించడం కొత్త అనుభవమని కళ్యాణ్ రామ్ తెలిపాడు. సినిమా నిడివి 2 గంటల 19 నిమిషాలు కాగా.. రెండు నిమిషాలు మినహాయిస్తే సినిమా మొత్తం ప్రతి ఫ్రేమ్‌లో తాను ఉంటానని కళ్యాణ్ రామ్ తెలిపాడు.
బింబిసార సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో అమిగోస్ లాంటి ప్రయోగాత్మక చిత్రం చేసినట్లు కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త పాత్ర చేయాలని తాను ఆలోచిస్తానని.. తన కెరీర్లో అత్యంత సవాలుతో కూడుకున్న సినిమా ఇదని అతను చెప్పాడు.
బింబిసార తర్వాత తాను కొత్తగా ఒక కథ కూడా వినలేదని.. ఆ సినిమా సక్సెస్ కంటే ముందే అమిగోస్ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని ఓకే చేశానని చెప్పాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేస్తుందని అతనన్నాడు.
తాను నటిస్తున్న మరో చిత్రం డెవిల్ చిత్రీకరణ 70 శాతం పూర్తయిందని.. ఆ చిత్రం కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుందని కళ్యాణ్ రామ్ తెలిపాడు. బింబిసార-2 షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశాలున్నట్లు కళ్యాణ్ రామ్ వెల్లడించాడు.
This post was last modified on February 8, 2023 10:03 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…